ఘొల్లుమన్న కొండాయి.. జంపన్నవాగు వరదలకు 8మంది బలి; తాజా పరిస్థితి ఇలా!!
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని కొండాయి విషాదంలో మునిగిపోయింది. కురిసిన భారీ వర్షాలతో జంపన్న వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఒక్కసారిగా కొండాయి ముంచెత్తిన వరద ఎనిమిది మంది ప్రాణాలను బలిగొంది. ప్రజలు ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకొని తమను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా కొండాయి లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్ర విషాదంలో నింపింది.
గురువారం నాడు వరదల్లో కొట్టుకుపోయి గల్లంతైన వారంతా విగత జీవులుగా మారటం అక్కడివారిని శోకసంద్రంలో ముంచేసింది. దృష్టిలో పెట్టుకొని ఊరు మునుగుతుందేమోనన్న భయంతో సురక్షిత ప్రాంతానికి వెళ్దామనుకుని బయలుదేరిన వారు జంపన్న వాగు నీళ్లలో మునిగిపోయారు. ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు ఎనిమిది మంది మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది.

కొండాయి గ్రామానికి చెందిన మహమ్మద్ మజీద్ ఖాన్, ఆయన భార్య లాల్ బిబి, షేక్ మహబూబ్ ఖాన్, ఆయన కుమారుడు అజార్, మహమ్మద్ రషీద్ ఆయన భార్య కరీమా, కొండాయి గోవిందరాజులు దేవాలయ ప్రధాన పూజారి తల్లి దబ్బ కట్ల సమ్మక్క తదితరులు వరద ప్రవాహంలో కొట్టుకుపోగా రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి ఎనిమిది మంది మృతదేహాలు వెలికి తీశారు.
వీరంతా వరద పెరుగుతున్న సందర్భంగా మల్యాల గ్రామానికి వెళుతున్న క్రమంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు వెంట నడుస్తూ రెండు గ్రామాల మధ్యకు రాగానే హఠాత్తుగా ఒక్కసారిగా వరద ముంచెత్తి, ఆ వరదలో కొట్టుకుపోయారు. గల్లంతయిన వారిలో రషీద్ గజ ఈతగాడు అయినప్పటికీ వరద ఉధృతిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాడు.
ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆర్మీ హెలికాఫ్టర్ ను రంగంలోకి దింపి కొండాయి గ్రామంలోని మిగిలిన వారిని కాపాడినప్పటికీ ఎనిమిది మంది మృతి చెందడం కొండాయి వాసులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది.కొండాయి మల్యాల మధ్యన కొత్త కల్వర్టు నిర్మించగా, ఆ కల్వర్టు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో అక్కడ రోడ్డే ఉందని భావించిన వారందరూ అందులో పడి కొట్టుకుపోయారు.

ములుగు ఎమ్మెల్యే సీతక్క కొండాయి లో మరణించిన వారిని చూసి కన్నీరు మున్నీరుగా రోదించారు. అభం శుభం తెలియని తమ వారిపై ప్రకృతి కన్నెర్ర చేసిందని, తమ వారిని పొట్టనపెట్టుకుంది అని గిరిజన గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇలా ఉంటే రెండు రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ ద్వారా ఆహార ప్యాకెట్లు, మంచినీళ్ల సీసాలు, మెడికల్ కిట్లు పంపిస్తోంది.
సాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్న కొండాయి గ్రామ ప్రజలకు అండగా నిలవడం కోసం సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వారికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లాలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications