రైతుబంధుతో పాటు కూలీబంధు ఇస్తాం: కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క హామీల వర్షం!!

పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్న భట్టివిక్రమార్క తెలంగాణ సీఎం కేసీఆర్ ను, తెలంగాణ ప్రభుత్వ వైఖరిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎజెండా అయిన నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రజల ఆత్మ గౌరవాన్నిలేకుండా చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని సిఎల్పి నేత బట్టి విక్రమార్క మండిపడ్డారు.

నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలు, అప్పులు, ప్రభుత్వ భూములు అమ్మడం వంటి పనులలో బిజీగా ఉందని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో సిఎల్పి నేత భట్టి విక్రమార్క పాదయాత్ర సాగించారు.ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ యాత్ర సందర్భంగా ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.

bhatti vikramarka

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వస్తేనే అందరికి సమస్యలు తీరడంతో పాటు వారి సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాటలతో ప్రజలను మభ్య పెడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మడం, అప్పులు చేయడంలో దేశానికే మోడల్ గా నిలిచిందని ఆరోపించారు. గతంలో నీలం తుపాఫ్ వస్తే తమ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పంట నష్టం పరిహారం అందించినట్లు తెలిపారు.

ప్రస్తుత బిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలుగా రైతులకు నష్ట పరిహారం చెల్లించకపోగా, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారని మండి పడ్డారు. రైతుబంధుతో పాటు కూలీలకు కూలీ బంధు పథకం కూడా ఇస్తామని భట్టి విక్రమార్క ప్రజలకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు.

ఇల్లు కట్టుకునేందుకు స్థలాలు లేని వారికి స్థలాలు కూడా కేటాయిస్తామని పేర్కొన్నారు. పావలా వడ్డీలకు రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యంతో పాటు తొమ్మిది రకాల సరుకులు అందజేస్తామని, గ్యాస్ సిలిండర్ ను 500 రూపాయలకే అందజేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ మొదటివారంలోనే జీతాలు వేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో సహజ వనరులు కాపాడతామని, సహజ వనరుల దోపిడీకి పాల్పడుతున్న మాఫియా భరతం పడతామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+