కోటి దీపోత్సానికి వెళ్లాలనుకుంటున్నారా? ఈ రూట్లల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Koti Deepotsavam 2024: ప్రతి కార్తీకమాసంలో హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద గల ఎన్టీఆర్ స్టేడియంలో వైభవంగా జరగబోయే కోటి దీపోత్సవం కార్యక్రమానికి వెళ్లే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ కార్యక్రమం ముగిసేంత వరకూ అంటే ఈ నెల 25వ తేదీ వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి లోయర్ ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ స్టేడియం వరకూ ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. మొత్తం 76 బస్సులను ప్రవేశపెట్టింది టీజీఎస్ఆర్టీసీ.

Koti Deepothsavam 2024 TGSRTC set to run special buses to NTR Stadium Hyderabad

ఉప్పల్ (రూట్ నంబర్ 113 ఐ/ఎం, 113 కే/ఎల్) కంటోన్మెంట్ (20 పీ), ఎన్జీఓ కాలనీ, దిల్‌షుక్ నగర్, అల్వాల్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, మెహదీపట్నం, ఈసీఐఎల్, జీడిమెట్ల, మేడ్చల్, ల్యాబ్ క్వార్టర్స్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, లింగంపల్లి, శంషాబాద్, కోఠి, ఎల్బీ నగర్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు ఆయా బస్సులు నడుస్తాయి.

బస్సుల రాకపోకలను పర్యవేక్షించడానికి, కోటి దీపోత్సవానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం టీజీఎస్ఆర్టీసీ అధికారులు అదనపు సిబ్బందిని మోహరింపజేశారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 11:30 గంటల వరకు వాళ్లంతా ఆయా బస్ పాయింట్లు, ఎన్టీఆర్ స్టేడియం వద్ద విధి నిర్వహణలో ఉంటారు.

అలాగే- కోఠి బస్‌ స్టేషన్, సికింద్రాబాద్ రేతిఫైల్ బస్‌ స్టేషన్‌లల్లో 24 గంటల పాటు పని చేసేలా ప్రత్యేకంగా కమ్యూనికేషన్ సెల్‌ను ఏర్పాటు చేశారు. వాటి ఫోన్ నంబర్లు కోఠి బస్‌ స్టేషన్- 9959226160, రేతిఫైల్ బస్‌ స్టేషన్- 9959226154. ప్రజా రవాణాను వినియోగించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+