వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిజైన్.. చంద్రబాబుకు కృష్ణయాదవ్ షాక్: కెసిఆరే స్మార్ట్‌సిటీ వద్దన్నారు: కిషన్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు కృష్ణ యాదవ్ శుక్రవారం నాడు ఝలక్ ఇచ్చారు. ఆయన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. గ్రేటర్ ఎన్నికల సీట్ల కేటాయింపులో తన వర్గానికి అవకాశం ఇవ్వలేదని ఆయన రాజీనామా చేశారు.

స్మార్ట్ సిటీ చేయవద్దని అన్యాయం చేసింది: కిషన్ రెడ్డి

హైదరాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీ చేయవద్దని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేసిందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి శుక్రవారం నాడు ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సాయం తప్పనిసరిగా అవసరమని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానివి మాటలే తప్ప చేతలు లేవని ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం - బిజెపి గెలుపు ఖాయమని చెప్పారు. తెలంగాణకు కేంద్రం రూ.50వేల కోట్ల సాయం చేసిందని కిషన్ రెడ్డి చెప్పారు. స్వచ్ఛ హైదరాబాద్ అంటూ ఆర్భాటం చేశారనే కానీ చివరకు చెత్త నగరంగా మార్చారన్నారు.

Krishna Yadav resigns as Vice President from TDP

తెరాస పాలనలో నగరం విశ్వనగరంగా కాదని, విషనగరంగా మారుతోందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి బిజెపితోనే సాధ్యమని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో తమ కూటమికి అవకాశమిచ్చి ఆశీర్వదించాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

తెలుగుదేశం పార్టీ వల్లే హైదరాబాదుకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కిందని తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. ఎన్నికల సమయంలో హైదరాబాద్ ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కెసిఆర్ నెరవేర్చలేదన్నారు. కిషన్ రెడ్డి, ఎల్ రమణలు టియుడబ్ల్యుజే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

English summary
Krishna Yadav resigns as Vice President from TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X