అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఔదార్యం:నాలుగేళ్ళ బాలికకు ఊపిరితిత్తుల క్యాన్సర్, చికిత్సకు సహకరిస్తామన్న మంత్రి కెటిఆర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్న నాలుగేళ్ళ బాలికకు అవసరమైన చికిత్స అందించేందుకు ముందుకు వచ్చారు తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్. ఈ బాలిక ప్రాణాలను రక్షించాలని కోరుతూ కొందరు విధ్యార్థులు క్యాంపెయిన్ ను ప్రారంభించారు. ఈ క్యాంపెయిన్ ద్వారా విషయం తెలుసుకొన్న మంత్రి కెటిఆర్ ఆ బాలికకు అవసరమైన సహయాన్ని అందించేందుకుగాను ముందుకు వచ్చారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన మురళి, స్వప్న దంపతుల కూతురు శ్రావణ సంద్య ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతోంది. మురళి ఇన్సూరెన్స్ ఏజంట్ గా పనిచేస్తున్నారు. నాలుగేళ్ళ కూతురు శ్రావణ సంధ్య అనారోగ్యానికి గురికావడంతో ఆమెను పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు.అయితే ఈ చికిత్సలో ఆమె ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్న విషయాన్ని గుర్తించారు వైద్యులు.

హైద్రాబాద్ లేదా విజయవాడ, చెన్నైల్లో చికిత్స చేయించాలని డాక్టర్లు సూచించారు.అయితే ఈ చికిత్సకు లక్షలాదిరూపాయాలు ఖర్చయ్యే అవకాశం ఉందని వైద్యులు ప్రకటించారు.

KT Rama Rao comes to aid of girl with cancer

దీంతో ఆశ్రమ్ మెడికల్ కాలేజీ, సిఆర్ రెడ్డి కాలేజీ, రామచంద్ర కాలేజీ విధ్యార్థులు శ్రావణ సంద్యకు సహయం చేయాలని కోరుతూ క్యాంపెయిన్ ను ప్రారంభించారు. ఈ క్యాంపెయిన్ ద్వారా సుమారు రెండులక్షల రూపాయాలను సేకరించారు విధ్యార్థులు..ఈ విరాళాలు కూడ సరిపోయే పరిస్థితి లేదు. అరుదైన వ్యాధిగా వైద్యులు చెబుతున్నారు.

దీంతో ఈ కాలేజీ విధ్యార్థులు ఆన్ లైన్ లో చేపట్టిన క్యాంపెయిన్ లో కొందరు రాజకీయ నాయకుల దృష్టికి కూడ శ్రావణ సంద్య విషయాన్ని తెచ్చేందుకు ప్రయత్నించారు.ఇందులో భాగంగానే తెలంగాణ ఐటిశాఖ మంత్రి కెటిఆర్ కు ఈ విషయాన్ని తెలిసేలా ట్యాగ్ చేశారు విధ్యార్థులు.

ఈ విషయాన్ని తెలుసుకొన్న మంత్రి కెటిఆర్ కార్యాలయ సిబ్బంది శ్రావణ సంధ్య తల్లిదండ్రులతో మాట్లాడారు.శ్రావణ సంధ్య వైద్య చికిత్సకు అవసరమైన సహయం అందంచేందుకు సహకరిస్తామని మంత్రి కార్యాలయ సిబ్బంది చెప్పారు.మంత్రి కార్యాలయ సిబ్బంది ఇచ్చిన భరోసాతో శ్రావణ సంధ్య తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

English summary
A 4-year-old girl, P Sravana Sandhya from Eluru, who was suffering from lung cancer received help for her treatment from an unexpected source.Responding to a request on Twitter, the Telangana state minister K.T. Rama Rao assured the girl’s parents of all help for the treatment of their daughter Sandhya. The campaign to save Sandhya was started by students of Ramachandra College, CR Reddy College and Asramam Medical College.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X