నా మాటా లెక్క చేయొద్దు, నేను కేసీఆర్ కొడుకునైనా: కేటీఆర్
హైదరాబాద్: మా పార్టీకి చెందిన కార్పోరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు.. చివరకు మున్సిపల్ మంత్రిగా తాను, ఇంకా చెప్పాలంటే విపక్షాలు అడ్డుకున్నా సరే అక్రమ కట్టడాల కూల్చివేతలు ఆగవని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు.
ఎవరు ఆపినా, ఎవరు అడ్డుకున్నా తాము పట్టించుకోమని చెప్పారు. అన్నీ కూల్చేస్తామన్నారు. తాము పేదవారి గుడిసెలు కూల్చడం లేదని, నాలాల పైన అక్రమ నిర్మాణాలనే లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు. పేదల ఇళ్లు కూల్చవలసి వస్తే వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు.

చెరువుల రక్షణకు ఆధునిక టెక్నాలజీ
చెరువులకు జియో ఫెన్సిక్ చేస్తున్నామని, ఎవరైనా ఆక్రమిస్తే అధికారులకు సంక్షిప్త సమాచారం అందుతుందన్నారు. తాను కేబినెట్ మంత్రిని అని, అందులోను ముఖ్యమంత్రి కొడుకుని అని, అయినా పక్షపాతం లేదన్నారు.
శాస్త్రీయంగా కొత్త జిల్లాల ఏర్పాటులో సిరిసిల్లకు చోటు కల్పించలేదని చెప్పారు. సిరిసిల్లలో కలపడానికి 9 మండలాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయని, అదీ కాక 5 లక్షల జనాభా మాత్రమే సిరిసిల్లకు అనుకూలంగా ఉందని చెప్పారు. తాను జిల్లా కోసం ప్రతిపాదించినప్పటికీ శాస్త్రీయంగా సాధ్యం కాలేదన్నారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications