హైదరాబాద్ వస్తే వాటి కోసమే: సచిన్, కెటిఆర్‌తో సెల్ఫీ అదుర్స్ (పిక్చర్స్)
హైదరాబాద్: తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చెప్పారు. తాను హైదరాబాద్‌కు వచ్చానంటే ఒకటి క్రికెట్ కోసం, రెండు బిర్యానీ కోసమని చెప్పారు. హైదరాబాద్ వస్తే బిర్యానీ తినకుండా వెళ్లనని చెప్పాడు. దేశీ టెక్నాలజీ సెల్‌ఫోన్ తయారీ కంపెనీ స్మాట్రాన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ వ్యవహరిస్తున్న అతడు గురువారం హైదరాబాద్ వచ్చారు.
భారత్ స్కిల్ ఇండియాకు కూడా ప్రచార కర్తగా ఉన్న సచిన్ ఈ సందర్భంగా మాట్లాడారు. భారత్‌ను సెల్ ఫోన్ తయారీ హబ్‌గా మార్చాలని, మేకిన్ ఇండియ ప్రోత్సహించడం ద్వారా ఉపాధి పెరగడమే కాకుండా ఆర్థిక వృద్ధి చెందుతుందని ఆకాంక్షించాడు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతరత్న సచిన్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు. వీరిద్దరూ కలిసి సరదాగా ఓ సెల్ఫీ దిగారు.

స్మాట్రాన్ టీఫోన్ ని ఆవిష్కరించిన సచిన్, కేటీఆర్ (పిక్చర్స్)
ఆవిష్కరణ సందర్భంగా.. టీ ఫోన్ ను పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్, సచిన్ టెండూల్కర్ సహా మరికొందరు కంపెనీ యాజమాన్యం

స్మాట్రాన్ టీఫోన్ ని ఆవిష్కరించిన సచిన్, కేటీఆర్ (పిక్చర్స్)
ఆవిష్కరణ తర్వాత స్మాట్రాన్ విశేషాల గురించి, కంపెనీ గురించి తన అభిప్రాయాలను పంచుకుంటున్న సచిన్, పక్కనే సచిన్ స్పీచ్ ను గమనిస్తున్న మంత్రి కేటీఆర్.

స్మాట్రాన్ టీఫోన్ ని ఆవిష్కరించిన సచిన్, కేటీఆర్ (పిక్చర్స్)
టీ ఫోన్ గురించి పరస్పర అభిప్రాయాలను పంచుకుంటూ కబుర్లలో మునిగిపోయిన సచిన్, కేటీఆర్..

స్మాట్రాన్ టీఫోన్ ని ఆవిష్కరించిన సచిన్, కేటీఆర్ (పిక్చర్స్)
స్మాట్రాన్ టీ ఫోన్ ను ఆవిష్కరించాక ఫోన్ పై తన సంతకం చేస్తున్న కేటీఆర్, ఆసక్తిగా గమనిస్తూ పక్కనే సచిన్..

స్మాట్రాన్ టీఫోన్ ని ఆవిష్కరించిన సచిన్, కేటీఆర్ (పిక్చర్స్)
ఒకరు ప్రముఖ రాజకీయ నాయకులు.. ఒకరు ప్రముఖ క్రికెటర్.. టీ ఫోన్ ఆవిష్కరణ కార్యక్రమం చివర్లో కేటీఆర్, సచిన్ ఇద్దరు ఇలా సెల్ఫీని క్లిక్ మనిపించారు.

స్మాట్రాన్ టీఫోన్ ని ఆవిష్కరించిన సచిన్, కేటీఆర్ (పిక్చర్స్)
స్మాట్రాన్ టీఫోన్ గురించి కేటీఆర్ మాట్లాడుతున్న సందర్బంలో.. సచిన్ గురించి ప్రస్తావించగా నవ్వులు చిందిస్తున్న సచిన్, పక్కనే చప్పట్లు కొడుతూ కంపెనీ ప్రతినిథులు.












Click it and Unblock the Notifications