రేవంత్ లక్ష్యంగా కేటీఆర్, హరీష్ - లెక్కలతో సహా..!!
తెలంగాణ రాజకీయాలు నదీ జలాల చుట్టూ తిరుగుతున్నాయి. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం గతం లో కేసీఆర్ హయాంలో జరిగిన నీటి ఒప్పందాలు.. నిర్ణయాలు.. తమ ఆలోచనల గురించి వివరంగా చెప్పుకొచ్చింది. ముఖ్యమంత్రి సైతం తనకు తెలంగాణ తొలి ప్రాధాన్యతగా స్పష్టం చేసారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఆపివేయటం పైన చేసిన వ్యాఖ్యలను ఆ ప్రభుత్వం ఖండించింది. కాగా, బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఇదే అంశంలో సీఎం రేవంత్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు.
అసెంబ్లీలో ప్రభుత్వం నదీ జలాల గురించి వివరణ ఇస్తే.. తెలంగాణ భవనలో 'నదీ జనాలు-కాంగ్రెస్ ద్రోహాలు'అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ ఈ అంశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. చరిత్రలో ఎన్నో చూశామని.. కానీ చెక్‌డ్యామ్‌లను పేల్చే ఇలాంటి చెత్త ప్రభుత్వం భారతదేశంలోని ఇంకెక్కడా కానీ ఉండదని మండిపడ్డారు. కరువు నేలల్లో సిరులు పండించి మరణ మృదంగాలు మోగిన చోట జీవకళ తెచ్చిన పరిపాలకుడు.. అవమానాలు భరించి ఆకలి బాధలు కేసీఆర్ మాయం చేసారని చెప్పకొచ్చారు. తుబంధు కేసీఆర్ గురించి రేవంత్ అనరాని మాటలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. కేసీఆర్‌ను తిడుతున్న వారిని ఎన్నిసార్లు ఉరితీయాలని ప్రశ్నించారు. 420 హామీలిచ్చి ఎగవేసిన పార్టీని 420 సార్లు ఉరితీయాలని వ్యాఖ్యానించారు.రేవంత్ కి బేసిన్లు, బేసిక్స్ తెలియదని కేటీఆర్ ఎద్దేవా చేసారు.

మాజీ మంత్రి హరీష్ సైతం ఘాటు వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పీపీటీ ద్వారా చెప్పినవన్నీ అబద్దాలే చెప్పారని మండిపడ్డారు. నాడు తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాతో కలిపి మరణశాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు. నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాతో కలుపడం ఒక తప్పని, కలిపినా నాడు ఫజల్ అలీ కమిషన్ రద్దు చేయవద్దు అని చెప్పిన ప్రాజెక్టులను రద్దు చేయడం మరో తప్పని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణను ఆంధ్రాతో కలిపిన అనంత రం ఈ ప్రాంతానికి మేలు చేసే ప్రాజెక్టులను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసి మరణశాసనం రాసిందని ఆయన మండిపడ్డారు. శాసనసభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను హరీష్ తప్పు బట్టారు. తెలంగాణను అన్నపూర్ణగా మలిచిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications