కేటీఆర్, హరీశ్ రావును అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు: కోడిగుడ్లతో దాడి
నల్గొండ: బీఆర్ఎస్ పార్టీ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న బహిరంగ సభకు వారు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. వీరిని వీటీ కాలనీ వద్ద ఎన్ఎస్‌యూఐ, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలు తమ వీపులకు గో బ్యాక్ కేసీఆర్ అనే స్టిక్కర్లు అంటించుకున్నారు.
'కేటీఆర్ గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. పలువురు కోడిగుడ్లతో వాహనాలపై దాడి చేశారు. దీంతో అక్కడ స్పల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు. ఆ తర్వాత కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అక్కడ్నుంచి ముందుకు కదిలారు.

కుర్చీపై పింక్ టవల్‌వేసి.. కేసీఆర్ ఫొటో పెట్టి నిరసన
నల్గొండ సభ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కుర్చీ వేసుకుని కూర్చొని కృష్ణా నది కింద ప్రాజెక్టులు కట్టిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. పదేళ్లుగా పట్టించుకోలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మంగళవారం నల్గొండ క్లాక్ టవర్ చౌరస్తాలో ఓ కుర్చీవేసి దానిపై పింక్ టవల్ వేసి.. కేసీఆర్ ఫొటో పెట్టి నిరసన తెలిపారు.
KTR, Harish Rao and a group of former ministers were blocked by Congress workers in Nalgonda.
— Congress for Telangana (@Congress4TS) February 13, 2024
నల్గొండ వీటి కాలనీలో కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రుల బృందం బస్సును అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు.
👉 గోబ్యాక్ అంటూ నినాదాలు.
👉 నల్ల చొక్కాలు ధరించి బస్సుకు అడ్డంపడిన NSUI… pic.twitter.com/cdgwabdQsS
బీఆర్ఎస్ సర్కారు నల్గొండ జిల్లాకు పూర్తిగా అన్యాయం చేసిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. కేసీఆర్ నల్గొండలో సభ నిర్వహిస్తున్న క్రమంలో పలుచోట్ల కాంగ్రెస్ నిరసనలు తెలుపుతూ సమావేశాలు నిర్వహించింది.












Click it and Unblock the Notifications