ఏదీ ఎక్కువ కాదు: కూతురు కోసం స్కూల్‌కి కేటీఆర్(పిక్చర్స్)
తన కూతరు కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు.
హైదరాబాద్: తన కూతరు కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. ఎప్పుడూ అధికారిక కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉండే తన కూతురి పేరెంట్- టీచర్ మీటింగ్‌కు హాజరయ్యారు.
More butterflies in my stomach to attend my 8 yr old daughter's parent-teachers meeting than for my assembly debates or elections!! Hmmm 🤔
— KTR (@KTRTRS) 7 January 2017

మురిసిన కేటీఆర్
కూతురు అలేఖ్య(8) ప్రొగ్రెస్ రిపోర్టును చూసి మురిసిపోయారు మంత్రి కేటీఆర్. కూతురి ప్రొగ్రెస్ రిపోర్టును మంత్రి తిరగేశారు. తాను ఊహించిన దాని కంటే తన కూతురు మెరుగ్గా చదువుతోందన్నారు.

సాధారణ తండ్రిలానే..
కేటీఆర్.. మంత్రిగా కాకుండా సాధారణ తండ్రిగానే టీచర్లతో సంభాషించారు.అలేఖ్య స్టడీస్ గురించి టీచర్లను అడిగి తెలుసుకున్నారు. అలేఖ్య చదువు గురించి మంత్రికి టీచర్లు వివరించారు.

సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు
తన కూతురిపై ఉన్న ఆప్యాయతను కేటీఆర్ ట్వీటర్ ద్వారా పంచుకున్నారు. పేరెంట్ టీచర్ మీటింగ్‌కు వెళ్లేందుకు చాలా ఉత్సుకత చూపినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.

కూతురు కంటే ఏదీ ఎక్కువ కాదు
తన కూతురు కంటే ఏదీ ఎక్కువ కాదని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు, ఎన్నికల కంటే కూడా తాను తన కూతురు కోసం టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. కాగా, సోషల్ మీడియాలో మొదట ఫొటోలను పోస్ట్ చేసిన కేటీఆర్.. ఆ తర్వాత తీసేసి, మళ్లీ పోస్టు చేశారు.












Click it and Unblock the Notifications