• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేటీఆర్ అభిమాన సంఘాలపై ఆయన గుస్సా.. అన్ని రద్దు...! ఎందుకలా?

|

హైదరాబాద్ : కేటీఆర్ యువసేన, కేటీఆర్ సేవాదళ్, కేటీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్.. ఇలా తెలంగాణ అంతటా ఎన్ని అభిమాన సంఘాలున్నాయో లెక్కే లేదు. ఇక సోషల్ మీడియాలో వాటికి అంతే లేదు. రకరకాల ఫ్యాన్స్ అసోసియేషన్స్ దర్శనమిస్తాయి. అయితే వీటన్నంటికీ చెక్ పెడుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

తన పేరుపై ఏర్పాటుచేసిన యువసేనలు గానీ, అభిమాన సంఘాలు గానీ ఇకపై ఎక్కడా కనిపించొద్దని సూచించారు. సోషల్ మీడియాలో తన పేరుపై నిర్వహిస్తున్న అకౌంట్లను వెంటనే నిలిపివేయాలని కోరారు.

అభిమానమంటే అవీ కాదు..! పార్టీతో చేతులు కలపండి

అభిమానమంటే అవీ కాదు..! పార్టీతో చేతులు కలపండి

యువసేనలు, అభిమాన సంఘాలపై కేటీఆర్ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. అభిమానం పేరిట తన పేరుతో ఏర్పాటు చేస్తున్న ఇలాంటి వాటికి మద్దతివ్వబోనని స్పష్టం చేశారు. కేటీఆర్ యువసేన, కేటీఆర్ అభిమాన సంఘం తదితర పేర్లతో పలు సంఘాలు ఏర్పాటయినట్లు తన దృష్టికి వచ్చిందని.. వీటిని ఏమాత్రం ఆమోదించబోనని వెల్లడించారు. వెంటనే వీటి నిర్వహణ ఆపడంతో పాటు రద్దు చేసుకోవాలని సూచించారు. తనపై అభిమానముంటే టీఆర్ఎస్ పార్టీతో గానీ లేదంటే అనుబంధ సంఘాలతో గానీ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

 క్లియర్ కట్.. నా ఆమోదం లేదు

క్లియర్ కట్.. నా ఆమోదం లేదు

కేటీఆర్ పేరుతో గానీ పార్టీపైన అభిమానంతో ఏర్పాటు చేసే సంఘాలకు గానీ తన ఆమోదం లేదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తన పేరిట ఏర్పాటు చేసిన సంఘాలను వెంటనే రద్దుచేసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో కూడా తన పేరుపై అభిమాన సంఘాలు నిర్వహించేవారు వెంటనే ఆ కార్యకలాపాలు స్తంభింపజేయాలని కోరారు. కేటీఆర్ యువసేన పేరుతో తనను కలిసేందుకు వచ్చిన అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఈవిధంగా నిర్ణయం తీసుకున్నారు. వెంటనే మీ సంఘాన్ని రద్దు చేసుకుని.. టీఆర్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని వారికి దిశానిర్దేశం చేశారు.

అభిమాన సంఘాలతో నష్టమేంటి?

అభిమాన సంఘాలతో నష్టమేంటి?

సాధారణంగా సినిమావాళ్లకు సంబంధించి అభిమాన సంఘాలు ఉండటం సాధారణం. రానురాను రాజకీయనేతలకు సంబంధించి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏర్పడ్డాయి. నచ్చిన లీడర్ల పేరుతో యువసేనలు, అభిమాన సంఘాలు పెట్టడం పరిపాటి అయింది. సదరు నేతల జన్మదిన వేడుకలు నిర్వహించడం, వారు తలపెట్టిన కార్యక్రమాలు సక్సెస్ చేయడం ఆ సంఘాల పని. ఈమేరకు ఆయా లీడర్లు కూడా తమకు యువసేనలు ఉండాలని ఉవ్విళ్లూరుతారు.

అయితే తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశమయ్యాయి. తన పేరిట ఉన్న అభిమాన సంఘాలన్నీ రద్దు చేయాలని పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోషల్ మీడియాలో కేటీఆర్ పేరుతో వందలాది అభిమాన సంఘాలున్నాయి. అయితే అభిమానం మితిమీరితే పర్యవసానాలు కూడా అదేస్థాయిలో ఉంటయనేది ఆయన అంతరంగం కావొచ్చు. అందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చేమో.

 పార్టీ బలోపేతమే లక్ష్యమా? కేటీఆర్ వ్యాఖ్యల మర్మమేంటి..!

పార్టీ బలోపేతమే లక్ష్యమా? కేటీఆర్ వ్యాఖ్యల మర్మమేంటి..!

అభిమాన సంఘాల రద్దు నిర్ణయంతో చరిత్రలో ఇప్పటివరకు ఏ నేత చేయనటువంటి సాహసం కేటీఆర్ చేశారని చెప్పొచ్చు. అయితే దీని వెనుక బలమైన కారణాలు ఉంటాయనేది క్లియర్ కట్. అభిమాన సంఘాలంటూ ఎవరికివారు కార్యక్రమాలు చేయడంతో పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండదు. అదే అందరూ ఏకతాటిపైకి వస్తే పార్టీకి మరింత బలం చేకూరుతుందనేది కేటీఆర్ మనసులో మాటగా కనిపిస్తోంది.

అభిమాన సంఘాలు, యువసేనల్లో దాదాపు యువతదే అగ్రస్థానం. అలాంటప్పుడు వారందర్నీ పార్టీతో భాగస్వామ్యం చేస్తే మంచి ఫలితాలు వస్తాయనేది ఆయన ఆలోచనేమో. కేటీఆర్ తాజా నిర్ణయంతో అలాంటి సంఘాలన్నీ రద్దయిపోతే.. అభిమానం ఉన్నవాళ్లు కచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలోనో దానికి అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘంలోనో జాయిన్ అవుతారు. అలా కారు స్పీడును మరింత పెంచే ఉద్దేశంతోనే కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అర్థమవుతోంది. మొత్తానికి లీడర్లకు వెన్నుదన్నుగా నిలిచే అభిమాన సంఘాలను ఆయన వద్దనడం ప్రస్తుతం హాట్ టాపిక్.

English summary
KTR said that he did not have his approval either for associations on his name or for the affiliate organizations of the party. In various districts throughout the state, the unions that have been set up in its name have been called off immediately. In the social media, even the fan clubs on his name have urged the immediate steps to be frozen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X