హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ పాలన ఎలా ఉంది?: ఆర్ధికవేత్త విఠల్‌కు కేటీఆర్ నమస్కారం (ఫోటోలు)

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ ఆర్ధికవేత్త బీపీఆర్ విఠల్‌ను మంత్రి కేటీఆర్ కలిశారు. బుధవారం బంజారాహిల్స్‌లోని విఠల్ ఇంటికెళ్లిన కేటీఆర్ ముందుగా నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గంటసేపు ఆయనతో ముచ్చటించారు. తెలంగాణ ఉద్యమానికి పునాది అయిన పుస్తకాల్లో ఒకటైన 'తెలంగాణ సర్‌ప్లస్ - ఏ కేస్ స్టడీ' అనే పుస్తకాన్ని రచించారు.

ఈ పుస్తకం ద్వారా తెలంగాణలో జరుగుతున్న ఆర్ధిక దోపిడీని అందరికీ తెలిసేలా చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో తెలంగాణ ఆర్ధిక పరిస్థితిని ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పడంలో విఠల్ రాసిన పుస్తకం తమకు, సీఎం కేసీఆర్‌కు ఎంతగానో ఉపయోగపడిందన్నారు.

ప్రొఫెసర్ జయశంకర్ సార్‌తో ఉన్న అనుబంధాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై విఠల్ అభిప్రాయాలను మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రం సరైన దిశలోనే ముందుకు సాగుతోందన్న విఠల్ చెప్పారని అన్నారు.

కాగా, తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జిల్లాల పునర్విభవనపై విలువైన సలహాలు ఇచ్చారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. విఠల్ సలహాలను, పాలనలో తీసుకోవాల్సిన చర్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు కేటీఆర్ చెప్పారు.

 ఆర్ధికవేత్త విఠల్‌కు కేటీఆర్ నమస్కారం

ఆర్ధికవేత్త విఠల్‌కు కేటీఆర్ నమస్కారం

ప్రముఖ ఆర్ధికవేత్త బీపీఆర్ విఠల్‌ను మంత్రి కేటీఆర్ కలిశారు. బుధవారం బంజారాహిల్స్‌లోని విఠల్ ఇంటికెళ్లిన కేటీఆర్ ముందుగా నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గంటసేపు ఆయనతో ముచ్చటించారు. తెలంగాణ ఉద్యమానికి పునాది అయిన పుస్తకాల్లో ఒకటైన 'తెలంగాణ సర్‌ప్లస్ - ఏ కేస్ స్టడీ' అనే పుస్తకాన్ని రచించారు.

 ఆర్ధికవేత్త విఠల్‌కు కేటీఆర్ నమస్కారం

ఆర్ధికవేత్త విఠల్‌కు కేటీఆర్ నమస్కారం

ఈ పుస్తకం ద్వారా తెలంగాణలో జరుగుతున్న ఆర్ధిక దోపిడీని అందరికీ తెలిసేలా చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో తెలంగాణ ఆర్ధిక పరిస్థితిని ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పడంలో విఠల్ రాసిన పుస్తకం తమకు, సీఎం కేసీఆర్‌కు ఎంతగానో ఉపయోగపడిందన్నారు.

కొత్త సివిల్ సర్వెంట్లకు దిశానిర్దేశం చేసిన మంత్రి కేటీఆర్

కొత్త సివిల్ సర్వెంట్లకు దిశానిర్దేశం చేసిన మంత్రి కేటీఆర్

అధికారులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని, పరిపాలనలో ఒడిదుడుకులు ఎదురైనా తమ ఆశను వదులుకోవద్దని, ప్రజల కోసం పనిచేయడంలో ఉన్న సంతృప్తి విధి నిర్వహణలో ముందుకు నడిపిస్తుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించిన 20 మంది ర్యాంకర్లు బుధవారం మంత్రి కేటీఆర్‌ను కలిశారు.

 కొత్త సివిల్ సర్వెంట్లకు దిశానిర్దేశం చేసిన మంత్రి కేటీఆర్

కొత్త సివిల్ సర్వెంట్లకు దిశానిర్దేశం చేసిన మంత్రి కేటీఆర్

ఈ సందర్భంగా మంత్రి వారికి ప్రభుత్వం, పరిపాలన, రాజకీయాలు, ప్రజల ఆకాంక్షలపై దిశానిర్దేశం చేశారు. పరీక్షలో విజయం సాధించిన వారికి ఉద్యోగమే సిసలైన పరీక్ష అన్నారు. అధికారులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. ఉద్యోగ ప్రయాణంలో అనేక ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురవుతాయన్నారు.

కొత్త సివిల్ సర్వెంట్లకు దిశానిర్దేశం చేసిన మంత్రి కేటీఆర్

కొత్త సివిల్ సర్వెంట్లకు దిశానిర్దేశం చేసిన మంత్రి కేటీఆర్

తొలినాళ్లలో ఉన్న స్ఫూర్తిని నిరంతరం కొనసాగించాలన్నారు. ఎంతో ఇష్టపడి, కష్టపడి సాధించిన ఈ ఉద్యోగానికి, ప్రజల కోసం పనిచేస్తేనే సార్థకత ఉంటుందన్నారు. యువకులు, అత్యున్నత సంస్థల్లో విద్యాభ్యాసం చేసినవారు ప్రభుత్వంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజలకోసం పనిచేసేటప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని.. రాజకీయ ఒత్తిళ్లకు దూరంగా ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యంగా పని చేయాలన్నారు.

 కొత్త సివిల్ సర్వెంట్లకు దిశానిర్దేశం చేసిన మంత్రి కేటీఆర్

కొత్త సివిల్ సర్వెంట్లకు దిశానిర్దేశం చేసిన మంత్రి కేటీఆర్

ప్రజల భాగస్వామ్యంతో పని చేస్తూ, వారిలో సమిష్ఠితత్వం నెలకొల్పేలా అనేక కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేయాలని కోరారు. చాలా సందర్భాల్లో నిధుల కన్నా, స్వచ్ఛమైన ఆలోచనలతోనే ఫలితాలు వస్తాయని కేటీఆర్ తెలిపారు. ఆ దిశగా కొత్తగా ఎంపికైన సివిల్ సర్వీసెస్ విజేతలు పనిచేయాలని కోరారు.

English summary
IT Minister K.T. Rama Rao called on noted economist and retired IAS officer B.P.R. Vittal on Wednesday to seek his views and suggestions on development of Telangana post-bifurcation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X