వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంబాలీ ఫ్యామిలీకి కెటిఆర్ అండ: డైనమిక్ లీడరంటూ సోషల్ మీడియా(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆ కుటుంబానికి వచ్చిన కష్టం అంతా ఇంతా కాదు. ఏ సాయం అందకపోతే మరణమే దిక్కుగా వారి జీవితాలు సాగుతున్నాయి. వారి జీవితాలపై ఓ పత్రిక ప్రచురితం చేసిన కథనానికి చలించిపోయారు తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు. వెంటనే వారిని ఆదుకునేందుకు నిర్ణయించుకున్నారు.

మంత్రి కెటిఆర్ తోపాటు జగదీష్ రెడ్డి, లక్ష్మారెడ్డిలు కూడా వారికి అండగా నిలిచారు. అంతుబట్టని వ్యాధి నివారణకు వైద్య ఖర్చుల్లేక, పూట గడవక ఇబ్బంది పడుతున్న కుటుంబం విషయం మే7వ తేదీన మదర్స్‌డే సందర్భంగా వచ్చిన కథనాలపై రాష్ట్ర మంత్రులు స్పందించారు. వెంటనే నల్గొండ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు.

ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదేశించారు. పెద్దవూర మండలం చలకుర్తి గ్రామం పల్లవానికుంట తండా వాసి హమాలీ రమావత్‌బిచ్చా, అంబాలీ దంపతులకు నలుగురు సంతానం (ముగ్గురు కుమారులు, ఒక కూతురు) ఉన్నారు. చిన్నకుమారులు రవినాయక్, బాబునాయక్‌లతోపాటు కూతురు లక్ష్మి అంతుబట్టని నరాల వ్యాధితో వారి శరీరం చచ్చుబడి మంచానికే పరిమితమయ్యారు.

తండ్రి, పెద్దకొడుకు కూలీపైనే ఆ కుటుంబం ఆధారపడింది. కాగా, ఆ కుటుంబంలో తాను ఉండలేనని పెద్ద కోడలు వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన పెద్దకుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిరోజులకు రమావత్ బిచ్చా మంచంపట్టి తుదిశ్వాస విడిచాడు.

కుటుంబ పోషణ భారం తలకెత్తుకున్న అంబాలీ కూడా ఇటీవలే అనారోగ్యానికి గురైంది. దీంతో ఆ కుటుంబం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కాగా, మంత్రి కేటీఆర్ ఆదేశం మేరకు బుధవారం వైద్యారోగ్యశాఖ అధికారులు, ఆర్డీవో, డీఎంహెచ్‌వో, తహసీల్దార్ ఆ గ్రామానికెళ్లి కుటుంబ పరిస్థితి వాకబుచేశారు.

అంబాలీని జిల్లాకేంద్ర దవాఖానకు తీసుకొచ్చి మందులు అందజేశారు. ఇక ఇంటివద్దే ఆ కుటుంబానికి మందులు అందజేయాలని వైద్యశాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలిచ్చారు. జెనెటిక్ సంబంధిత వ్యాధి వల్లే పిల్లలు అంగ వికలురయ్యారని గుర్తించారు. ఆర్డీవో నివేదిక ఆధారంగా అంబాలీకి వృద్ధాప్య పింఛను, ముగ్గురు పిల్లలకు వికలాంగుల పింఛన్ అందజేయనున్నారు.

సంబంధిత రేషన్ డీలర్ కూడా ఇంటివద్దకే వచ్చి బియ్యం పంపిణీచేసేలా చర్యలు తీసుకున్నారు. ఆ కుటుంబ సంరక్షకుడికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఇది ఇలా ఉండగా, నలుగురు కుటుంబసభ్యుల భారాన్ని మోస్తున్న నిరుపేద గిరిజన తల్లికి చేసిన సాయం 'అసలైన మదర్స్‌డే బహుమతి' అని సోషల్ మీడియాలో మంత్రి కెటి రామారావుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో ఏపీలో తాము ఓ డైనమిక్ లీడర్‌ను మిస్సయ్యామని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. మీలాంటి నాయకుడు ఉండటం మా అదృష్టమని మరొకరు వ్యాఖ్యానించారు.

అంబాలీ కుటుంబానికి కెటిఆర్ అండ

అంబాలీ కుటుంబానికి కెటిఆర్ అండ

ఆ కుటుంబానికి వచ్చిన కష్టం అంతా ఇంతా కాదు. ఏ సాయం అందకపోతే మరణమే దిక్కుగా వారి జీవితాలు సాగుతున్నాయి. వారి జీవితాలపై ఓ పత్రిక ప్రచురితం చేసిన కథనానికి చలించిపోయారు తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు. వెంటనే వారిని ఆదుకునేందుకు నిర్ణయించుకున్నారు.

అంబాలీ కుటుంబానికి కెటిఆర్ అండ

అంబాలీ కుటుంబానికి కెటిఆర్ అండ

మంత్రి కెటిఆర్ తోపాటు జగదీష్ రెడ్డి, లక్ష్మారెడ్డిలు కూడా వారికి అండగా నిలిచారు. అంతుబట్టని వ్యాధి నివారణకు వైద్య ఖర్చుల్లేక, పూట గడవక ఇబ్బంది పడుతున్న కుటుంబం విషయం మే7వ తేదీన మదర్స్‌డే సందర్భంగా వచ్చిన కథనాలపై రాష్ట్ర మంత్రులు స్పందించారు. వెంటనే నల్గొండ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు.

అంబాలీ కుటుంబానికి కెటిఆర్ అండ

అంబాలీ కుటుంబానికి కెటిఆర్ అండ

మంత్రి కేటీఆర్ ఆదేశం మేరకు బుధవారం వైద్యారోగ్యశాఖ అధికారులు, ఆర్డీవో, డీఎంహెచ్‌వో, తహసీల్దార్ ఆ గ్రామానికెళ్లి కుటుంబ పరిస్థితి వాకబుచేశారు.

అంబాలీ కుటుంబానికి కెటిఆర్ అండ

అంబాలీ కుటుంబానికి కెటిఆర్ అండ

అంబాలీని జిల్లాకేంద్ర దవాఖానకు తీసుకొచ్చి మందులు అందజేశారు. ఇక ఇంటివద్దే ఆ కుటుంబానికి మందులు అందజేయాలని వైద్యశాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలిచ్చారు.

English summary
Responding to a tribal family’s miserable condition, Minister for Municipal Administration and Urban Development K. T. Rama Rao offered the family much-needed succour, as gathered from his latest tweet on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X