సబితమ్మ కోసం రణం.. కేటీఆర్, హరీష్ అరెస్ట్!!

తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిన్న సబితా ఇంద్రారెడ్డి పైన చేసిన వ్యాఖ్యల పైన నేటి తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన కొనసాగింది. తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఛాంబర్ ఎంట్రెన్స్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బైఠాయించి ఆందోళనకు దిగారు. సబితా ఇంద్రారెడ్డి పై సీఎం రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యల పైన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్, హరీష్ రావులను ఎత్తుకెళ్ళిన మార్షల్స్
ముఖ్యమంత్రి సబితా ఇంద్రారెడ్డికి తక్షణం క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ఆందోళనలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తదితరులు పాల్గొన్నారు. అయితే బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనను అడ్డుకున్న అసెంబ్లీ మార్షల్స్ కేటీఆర్ తో సహా ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేటీఆర్, హరీష్ రావులతో పాటు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేసి వారిని బిఆర్ఎస్ భవనం వైపుకు తీసుకువెళ్లారు.

https telugu oneindia com news andhra-pradesh chandrababu-jalaharati-to-krishna-river-at-srisailam-dam-key-comments-on-state-exchequer-397807 html

కేటీఆర్ డిమాండ్
పోలీసులు అరెస్టు చేసిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు .మహిళా శాసనసభ్యుల పట్ల అనుచితంగా గౌరవంగా మాట్లాడిన రేవంత్ వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

భగ్గుమన్న హరీష్ రావు
మహిళ ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ఈరోజు నిరసన తెలుపుతున్న తమన అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ధ్వంసం అయిందని అసెంబ్లీలో మహిళలకు అన్యాయం జరిగితే మైక్ ఇవ్వకుండా ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..
తెలంగాణ ఉద్యమంలో కూడా లేని ఆంక్షలు ప్రస్తుతం రేవంత్ హయాంలో కొనసాగుతున్నాయని రాష్ట్రమంతా పోలీసు రాజ్యంగా మారిందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే పైన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండల కేంద్రాలలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి రాగా, బీఆర్ఎస్ నుంచి ఉన్న ఇద్దరు మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలు నల్ల చీరలు కట్టుకుని తమ నిరసన తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+