ఈటలకు కేటీఆర్ కౌంటర్: అదానీ-మోడీపై పరోక్ష విమర్శలు
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రతిపక్షాల ప్రశ్నలకు అన్ని తానై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమాధానమిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నలకు ఘాటుగా స్పందించారు.
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రతిపక్షాల ప్రశ్నలకు అన్ని తానై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమాధానమిస్తున్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ప్రతిపక్ష నేతలకు కౌంటర్లు ఇస్తున్నారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ మంత్రి కేటీఆర్.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నలకు ఘాటుగా స్పందించారు.

అదానీ-కేంద్రంపై కేటీఆర్ పరోక్ష విమర్శలు
సింగరేణి, గనుల కేటాయింపుపై ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. ఎవరో ఒకరి కోసమో.. లేదా దోస్తుల కోసమో పనిచేసే రాష్ట్రం తెలంగాణ కాదని మంత్రి కేటీఆర్ పరోక్షంగా అదానీ వ్యవహారాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.
తెలంగాణ పరిశ్రమలకు అనుకూల రాష్ట్రమే తప్ప ఎవరో ఒక పారిశ్రామికవేత్తకు అనుకూల రాష్ట్రం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులు కూల్చేస్తామంటుంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం నిర్మిస్తోందని తెలిపారు.
ఒక వ్యక్తి కుబేరుడైతే సరిపోదంటూ బీజేపీపై కేటీఆర్
దేశీయ బొగ్గును కొనుగోలు చేయవద్దని దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని డిస్కంలకు గతంలో కేంద్రం లేఖలు రాసిందని చెప్పారు. తక్కువ ఖర్చుతో వస్తున్నప్పటికీ కొనుగోలు చేయకుండా విదేశాల నుంచి బొగ్గును కొనాలని కేంద్రం ఆదేశించిందని తెలిపారు. నాలుగు రెట్లు విలువైన బొగ్గును కొనుగోలు చేయాలని చెప్పిందని పేర్కొన్నారు.
ఎవరి కోసం.. ఎవరి ప్రయోజనాల కోసం ఈ ఆదేశాన్ని జారీ చేసిందో బీజేపీ నేతలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మోడీ తన దోస్తుల కోసం గనుల లీజులు ఇస్తున్నారని ఆరోపించారు. తాము ఎవరి కోసమో పనిచేయమని అన్నారు. ఒక వ్యక్తి కుబేరుడైతే దేశం బాగుంటుందని బీజేపీవారు భావిస్తున్నారని అన్నారు. సింగరేణి కాలరీస్ మెరుగైన ఫలితాలను సాధిస్తోందన్నారు.
విశాఖను చేసినట్లే సింగరేణినంటూ ఈటలకు కేటీఆర్ కౌంటర్
సింగరేణి కాలరీస్‌ను ప్రైవేటు పరం చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని ఈటల రాజేందర్ చెబుతున్నారని.. స్వయంగా ప్రధాని మోడీయే ఈ విషయం చెప్పారని అంటున్నారని కేటీఆర్ తెలిపారు. అయితే, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఇవాళ తుక్కు కింద అమ్మాలని చూస్తోంది ఎవరు? ఏ కారణం చేత విశాఖ ఉక్కును అమ్మాల్సి వస్తోంది? అని కేటీఆర్ ప్రశ్నించారు. విశాఖ విషయంలో పరిశ్రమకు కావాల్సిన ముడిసరుకు కోసం గనులు కేటాయించకపోవడంతోనే నష్టాల్లోకి వెళ్లిందని.. కానీ, దివాళా తీసిందని చెప్పి ప్రవైటుపరం చేసేస్తున్నారని ఆరోపించారు.
అదే వ్యూహాన్ని సింగరేణి విషయలోనూ కేంద్రం అనుసరించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. సింగరేణికి గనులు ఎందుకు కేటాయించలేదో చిత్తశుద్ధి ఉంటే.. కేంద్రాన్ని నిలదీయాలని ఈటల రాజేందర్‌కు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. చేనేత రంగంపైనా కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. ఇప్పటికే చేనేతపై 5 శాతం పన్ను ఉండగా, పెంచాలని చూస్తోందని ఆరోపించారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!!












Click it and Unblock the Notifications