సైబర్ సెక్యూరిటీలో టీ ముందడుగు, ఉబెర్‌తో ఒప్పందం (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణలో ఐటీని వినియోగించుకొని ప్రజలకు మరింత అత్యుత్తమ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం చెప్పారు. మీ సేవ ద్వారా పొందుతున్న సేవలను త్వరలోనే మొబైల్‌లోనూ అందుబాటులోకి తెస్తామన్నారు.
డిజిటల్ తెలంగాణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాదులోని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రులు కెటిఆర్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఐటి శాఖ ఎన్ఐసీ సహకారంతో రూపొందించిన దేవాదాయ శాఖ వెబ్ సైట్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ... ప్రభుత్వ శాఖల సమాచారాన్ని ఆన్ లైన్లో తెలుసుకునే ప్రక్రియకు దేవాదాయ శాఖతో శ్రీకారం చుడుతున్నామన్నారు. ప్రస్తుతానికి మీ సేవ ద్వారా ఇవి అందుబాటులో ఉంటాయన్నారు. త్వరలోనే అందరూ వినియోగించుకునేలా తీర్చిదిద్దుతామని చెప్పారు.

బయోడైవర్సిటీలో మొక్క నాటుతున్న కెటిఆర్
సైబర్ భద్రతారంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందగుడు వేసింది. ఐటీ పరిశ్రమకు ఎంతో ముఖ్యమైన సైబర్ సెక్యూరిటీ రంగంలో కలిసి పని చేసేందుకు సీఆర్ రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ సంస్థతో సోమవారం ఒప్పందం కుదుర్చుకున్నది.

తెలంగాణ
హైదరాబాద్ మాదాపూర్‌లోని టెక్ మహీంద్రా మెయిన్ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో సీఆర్ రావు సంస్థ చైర్మన్, రిజర్వ్‌బ్యాంకు మాజీ గవర్నర్ రంగరాజన్, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కెటిఆర్ సమక్షంలో ఎంవోయూపై ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, సీఆర్ రావు సంస్థ డైరెక్టర్ అల్లం అప్పారావు సంతకాలు చేశారు.

తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ తెలంగాణ కార్యక్రమంలో పాలుపంచుకోవటం సంతోషంగా ఉందని సీఆర్ రావు సంస్థ చైర్మన్ సీ రంగరాజన్ అన్నారు. ప్రస్తుతం డిజిటల్ సాధనాల వాడకం సర్వసాధారణమైందని, ఈ మార్పు మరో పారిశ్రామిక విప్లవానికి మార్గం చూపుతుందని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ
కాగా, సైబర్ భద్రత పైన సీఆర్ రావు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. శ్యాంసంగ్ డిజిటల్, నాస్కాం ఫౌండేషన్, ఉబెర్ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.

తెలంగాణ
ఈ పరిణామంలో అవకాశాలతోపాటు కొత్త సవాళ్లు కూడా ఎదురవుతున్నాయన్నారు. సైబర్ సెక్యురిటీలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు అభినందనీయమన్నారు. సిస్టమ్ సెక్యూరిటీ, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, సైబర్ సెక్యూరిటీకి తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.

తెలంగాణ
సైబర్ సెక్యూరిటీ బలంగా లేకపోవడంతో ఐటీ తదితర సంస్థలు భారీగా నష్టపోతున్నాయని, రక్తపాతరహిత యుద్ధం జరుగుతున్నదని కేటీఆర్ అన్నారు. ప్రస్తుత వైజ్ఞానికయుగంలో కొందరు తమ జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు.

తెలంగాణ
అందువల్లనే రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసి ఆ అంశాల్లో సవాళ్లను ఎదుర్కొని, అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలన్నింటినీ సమన్వయం చేసుకొని ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నదన్నారు.

తెలంగాణ
సైబర్ సెక్యూరిటీలో పేరెన్నికగన్న సీఆర్ రావు సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవటం ఇందులో మొదటి అడుగు అని పేర్కొన్నారు. ఈ- వ్యర్థాల నిర్వహణలో నాస్కాంతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు.

తెలంగాణ
జర్మన్ ఎకనామిక్ కో ఆపరేషన్, డెవలప్‌మెంట్ ప్రతినిధి బ్రూలీ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు తాము సహకరిస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications