వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి 'ఒక్కరోజు' సీఎంగా ఉండాలా, బాబును అడగండి: కేటీఆర్ ఆసక్తికరం

ఒకే ఒక్కడు సినిమాలో వలే కనీసం ఒక్కరోజు అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఏదయినా చేయమని తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును ఓ అభిమాని ట్విట్టర్‌లో కోరారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఒకే ఒక్కడు సినిమాలో వలే కనీసం ఒక్కరోజు అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఏదయినా చేయమని తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును ఓ అభిమాని ట్విట్టర్‌లో కోరారు.

దానికి కేటీఆర్ స్పందిస్తూ.. ఈ విషయం గురించి మొదట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అడగాలన్నారు. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ఆదివారం ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆసక్తికర చర్చ జరిగింది.

మ్యాచ్ చూస్తానన్న కేటీఆర్

సుశ్రుత్ సిరుపా అనే వ్యక్తి... సర్ ఈ రోజు మీ ప్లాన్ ఏమటని ప్రశ్నించారు. దానికి కేటీఆర్.. స్నేహితులతో కలిసి భారత్ - పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. మరో ట్విట్లో మరొకరు.. మీరు ష్యూర్లీ పొలిటీషియన్ కాదంటే.. దానిని కాంప్లిమెంటుగా స్వీకరిస్తున్నానని కేటీఆర్ అన్నారు. ఇంకో ట్వీట్‌కు స్పందిస్తూ.. సీఎం కేసీఆర్ అందరిలా క్రికెట్‌ను ఇష్టపడతారని చెప్పారు.

ఐ హేట్ యు... ఐ లవ్ యూ

మోహన్ కృష్ణ అనే వ్యక్తి... కేటీఆర్‌ను ఉద్దేశించి ఐ హేట్ యూ కేటీఆర్ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు బలమైన నాయకులు ఉన్నారని, కానీ మీలాంటి వారు విభేదాలు సృష్టిస్తున్నారని, మిమ్మల్ని ఓ ఇండియన్‌గా ప్రేమిస్తానని అన్నారు. దానికి కేటీఆర్ స్పందిస్తూ.. ఐ లవ్ యూ టూ అన్నారు. మరో వ్యక్తి.. హైదరాబాదులో ఎక్కడ హలీం మీకు నచ్చుతుందని అడగ్గా.. క్లిష్టమైన ప్రశ్న అన్నారు. మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు అని అడగ్గా.. అప్పట్లో రాహుల్ ద్రావిడ్ అని చెప్పారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరూ అని లేదన్నారు.

లోకేష్ లేదా రాహుల్ గాంధీ..

రాహుల్ గాంధీ లేదా లోకేష్‌లలో ఎవరినో ఒకరిని ఎంచుకోండని కార్తీక్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. ఒకరిని పిక్ చేసుకోవడం మీకు కష్టమే కానీ ఎంచుకోమని పేర్కొన్నారు. దానికి కేటీఆర్ స్పందిస్తూ.. ఎందుకు ఒకరిని ఎంచుకోవాలని ప్రశ్నించారు. మరో ట్వీట్లో.. మీకు ఇష్టమైన నటి ఎవరని అడిగితే.. అందరూ అని చెప్పారు.

ఉద్యమమా, పరిపాలనా?

తెలంగాణ ఉద్యమం, తెలంగాణ పాలన.. ఈ రెండింటిలో ఏది కష్టమైన పని అని శ్రీకాంత్ అని అడగ్గా.. అడ్మినిస్టేషన్ చాలా టఫ్ అని కేటీఆర్ చెప్పారు. ఏపీలోను మీకు అభిమానులు ఉన్నారని, అక్కడ ఏమైనా టూర్ వేసే ప్లాన్‌లో ఉన్నారా అని ఒకరు ప్రశ్నించారు.

చంద్రబాబు కావాలా, జగన్ కావాలా

చంద్రబాబు నాయుడు లేదా జగన్మోహన్ రెడ్డిలో ఒకరిని ఎంచుకోవాలని మహేష్ రెడ్డి అనే వ్యక్తి ట్వీట్ చేశారు. దానికి కేటీఆర్ స్పందించారు. తనకు ఏపీలో ఓటు హక్కు లేదని చెప్పారు. హిందీ గురించి ఓ ట్వీట్ రాగా.. తెలంగాణ ప్రజలకు నేచరల్‌గా వస్తుందని చెప్పారు.

చంద్రబాబుకు థ్యాంక్స్ ఎందుకు

చంద్రబాబు నాయుడుకు థ్యాంక్స్ చెప్పాలని పరమేష్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. దానికి కేటీఆర్.. ఎందుకు అని ప్రశ్నించారు. మరో ట్వీట్‌లో పాల్ చాలా బెట్టర్ అని ఏపీ ప్రజలు భావిస్తున్నారని పేర్కొనగా.. మే గాడ్ బ్లెస్ యూ అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఆంధ్రాని లీడ్ చేయండి..

మా ఆంధ్రని కూడా మీరే లీడ్ చేస్తే బాగుంటుందని నెల్లూరు నుంచి ఓ అభిమాని అయిన డాక్టర్ ఎంవీ రమణ మోహన్ అడిగారు. దానికి కేటీఆర్.. తెలంగాణలో చాలా పని ఉంది డాక్టర్ గారు అంటూ పేర్కొన్నారు.

చంద్రబాబును అడగండి

ఒకే ఒక్కడు మూవీలో వలే మీరు ఏపీకి ముఖ్యమంత్రిగా ఒకరోజు ఉండి, ఏదైనా చేయాలని సాయి కిరణ్ రెడ్డి అన్నారు. దయచేసి నో చెప్పకండి అన్నారు. దానికి కేటీఆర్ స్పందిస్తూ.. మొదట చంద్రబాబును అడగాలని సూచించారు.

English summary
Minister KT Rama Rao Interesting comments in Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X