రేవంత్ తీరుపై రాహుల్ ను టార్గెట్ చేసిన కేటీఆర్..!!
తెలంగాణలో రేవంత్ నిర్ణయాల పైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజల హక్కుల గురించి రాహుల్ గాంధీ ఎన్నో ఉపన్యా సాలు ఇస్తుంటారు. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతుంటే రాహుల్ కళ్లు మూసుకున్నారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమేనా మీ ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యం గురించి రాహుల్ ఇచ్చే ప్రసంగాలను ప్రస్తావించారు. జవాబుదారీతనంతోనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన కేటీఆర్.. రాహుల్ జీ.. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా గుర్తుచేస్తున్నా.. ప్రజల గొంతుకే అసలైన ప్రజాస్వామ్యం. అణచివేత కాదన్నారు.

బుల్డోజర్లతో ఇండ్లు కూల్చడం, అసమ్మతిని అణచివేయడం, జర్నలిస్టులపై దాడి చేయడమేనా ప్రజాస్వామ్యం అంటూ ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులు చేయడమేనా మీ ప్రజాస్వామ్యం అని నిలదీసారు.
ఇది ప్రజాస్వామ్యం కాదు.. నిరంకుశత్వం, అరాచకం.. అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన పైన కేటీఆర్ వరుస ట్వీట్లు చేసారు. అబద్దాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలపై చిన్నచూపు చూస్తోందని, ఒకటో తేదీన జీతాలు అన్నారు. ఇదేనా.. అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. జీతాలు సమయానికి ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు గడిచేది ఎట్లా అని నిలదీశారు. రాష్ట్రంలో రోజుకో అంశంతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మరిచి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు.. ఇందులో భాగంగానే తమ ఎమ్మెల్యేలపై దాడులూ చేయిస్తున్నారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications