వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశీ శాఖకు ఎక్కువ, ప్రధానికి తక్కువ: మోడీపై కెటిఆర్ తీవ్ర వ్యాఖ్యలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ ఐటి శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు కెటి రామారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ విదేశాంగ శాఖకు ఎక్కువ...ప్రధాని పదవికి తక్కువ అని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ధికారంలోకి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం ఏం చేసిందో గంట సేపు ఆగకుండా చెబుతానని అన్నారు. మరి కేంద్రం ఏం చేసిందో కిషన్‌రెడ్డి చెబుతారా? అంటూ కేటీఆర్ సవాల్ చేశారు. తెలంగాణ టిడీపి నేత రేవంత్‌, కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ ముచ్చట తీర్చే బాధ్యత మీరే తీసుకోవాలని ఆయన అన్నారు.

ఈ రోజు కార్టూన్ ; టిఆర్ఎస్‌లో కృష్ణా యాదవ్

హైదరాబాద్‌ను గత ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తే నీటి సమస్య ఎందుకుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. అన్ని పార్టీల కార్యాలయాలకు తాళాలు పడ్డాయని, ఏ సమస్య లేకుండా ముందుకెళ్తున్న పార్టీ తమది ఒక్కటేనని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

KTR makes comments against Narendra Modi

హైదరాబాద్‌లోని అంబర్‌పేటలోని ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల శంఖారావం సభలో కూడా ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లను దండుకోవాలని చూస్తోందని విమర్శించారు.

తెలంగాణ దేశంలో అంతర్భాగం కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో బీహార్, జమ్మూ కాశ్మీర్ రాష్ర్టాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారని గుర్తు చేశారు. మరి హైదరాబాద్‌లో ఎన్నికలు ఉన్నాయి కదా? హైదరాబాద్‌కు ఎందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించరని నిలదీశారు. తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.

English summary
Telangana IT minster and Telangana rastra Samithi (TRS) leader KT Rama Rao (KTR) made comments against PM Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X