2రాష్ట్రాల అభివృద్ధి విడిపోయాకే, గట్స్ ఉన్న లీడరున్నారు: ఐటి కంపెనీల సీఈఓలతో కెటిఆర్
హైదరాబాద్: విడిపోయాకే రెండు రాష్ట్రాలు అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నాయని తెలంగాణ పంచాయతీ, ఐటిశాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. తెలంగాణ ఉద్యమం స్టేట్ ఫైటే కానీ, స్ట్రీట్ ఫైట్ కాదని అప్పుడే చెప్పామని అన్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు సోదరభావంతో ముందుకెళుతున్నాయని చెప్పారు.
బుధవారం నిర్వహించిన ఐటి కంపెనీల సీఈఓలతో సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. విడిపోతేనే రెండు రాష్ట్రాలు బాగుంటాయని అప్పుడే చెప్పామని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ మిగులు ఆదాయంతో అభివృద్ధి దిశగా పయనిస్తోందని, దేశ వృద్ధి రేటును మించిన వృద్ధిరేటు సాధించిందని తెలిపారు. అదే సమయంలో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి సాధిస్తోందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ వచ్చాయని, గన్నవరం ఎయిర్‌పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మారుతోందని చెప్పారు. తిరుపతిలో కొత్త టెర్మినల్ వచ్చిందని అన్నారు. అమరావతి అనే కొత్త రాజధాని కూడా వచ్చిందని చెప్పారు. ఏపి 18నెలలుగా అభివృద్ధి దిశగా సాగుతోందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడకపోయుంటే మరో 25ఏళ్లఅయిన ఏపి అభివృద్ధి కాకపోయి ఉండేదని అన్నారు.
రాష్ట్రాలు విడిపోవడం వల్ల ఇద్దరికీ లాభమే జరిగిందని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారుతోందన్నారు. తమ ప్రభుత్వం టీ హబ్, టాస్క్ లాంటి కార్యక్రమాలతో ఐటిని అభివృద్ధి చేస్తోందని చెప్పారు. హైదరాబాద్ గురించి ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో కూడా మాట్లాడుతకుంటున్నారని చెప్పారు.

అమెరికా తర్వాత అతిపెద్ద మైక్రోసాఫ్ట్ ఇక్కడే కార్యాలయం ఏర్పటవుతోందని చెప్పారు. ఐటి, గేమింగ్, ఎంటర్టైనింగ్ రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఐఫా కార్యక్రమం కూడా హైదరాబాద్‌కు తేవడం టి ప్రభుత్వ ఘనతేనని చెప్పారు. హ్యాపెనింగ్ హైదరాబాద్, ఇతర ఐటికి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పంచాయతీ, ఐటి శాఖ మంత్రినని, అయితే ఐటికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు తెలిపారు.
కొత్త రాష్ట్రం ఏర్పడితే పెట్టుబడులు ఎలా వస్తాయని, ఐటి రంగంపైనా ఎన్నో అనుమానాలుండేవని.. అవన్నింటినీ పటాపంచలు చేస్తూ అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పారు. ఐటిలో పెద్ద ఎత్తున్న మరిన్ని కార్యక్రమాలు తెస్తామని చెప్పారు. ఇక్కడ అన్ని ప్రాంతాలవారు సేఫ్‌గా ఉండొచ్చని అన్నారు. విమర్శలు చేయడం ఈజీ కానీ, సామాజిక బాధ్యతను మరువద్దని యువతకు పిలుప
గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి నగర అభివృద్ధికి సహకరించాలని అన్నారు. గంట సమయం కేటాయించి మంచి అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. తాగునీరు, రోడ్లు, ప్లేగ్రౌండ్స్, ఆడిటోరియాలు మొదలగు వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. మంచి కార్పొరేటర్ ను ఎన్నుకుని పంపితే ఇవన్నీ జరుగుతాయని చెప్పారు.
కాంగ్రెస్, బిజెపి, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు ఇప్పటి వరకు అవకాశమిచ్చారు.. ఇప్పుడు తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఆ పార్టీలు పని చేసివుంటే నగరం ఇన్ని సమస్యలతో ఇట్లా ఉండేదా? అని కెటిఆర్ ప్రశ్నించారు. చెన్నైకి భిన్నంగా హైదరాబాద్ ఏమీ లేదని, భారీ వర్షం కొడితే పడవలు వేసుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి దిశగా సాగాలంటే టిఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని అన్నారు.
14ఏళ్ల క్రితం కెసిఆర్ నాయత్వంలో తెలంగాణ రాష్ట్రం వస్తుందంటే.. రంగుల కలలు అన్నారని.. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధ్యం చేసుకున్నామని చెప్పారు. ఇప్పుడు సీఎంగా గట్స్ ఉన్న లీడర్ కెసిఆర్ ఉన్నారని.. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా చేసుకుందామని అన్నారు.












Click it and Unblock the Notifications