వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగార్జునకు గిఫ్ట్‌లివ్వం, ఎగిరిపడుతున్నారు, లేనిది ఉన్నట్లు చెప్పను: కేటీఆర్

భాగ్యనగరంలో చాలా చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, వాటిని ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారని, అలాగే ఎన్ కన్వెన్షన్ పైన కేసీఆర్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరంలో చాలా చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, వాటిని ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారని, అలాగే ఎన్ కన్వెన్షన్ పైన కేసీఆర్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

మంగళవారం నాడు అసెంబ్లీలో జిహెచ్ఎంసి అభివృద్ధి పైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు.

పన్ను మినహాయింపు వేస్ట్: గౌతమీపుత్ర శాతకర్ణిపై సీఎంలకు వరుస షాక్‌లుపన్ను మినహాయింపు వేస్ట్: గౌతమీపుత్ర శాతకర్ణిపై సీఎంలకు వరుస షాక్‌లు

ఎన్ కన్వెన్షన్ పైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. ఎన్ కన్వెన్షన్ ప్రముఖ నటుడు నాగార్జునకు చెందినది. గతంలో ఎన్ కన్వెన్షన్ కట్టడంపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. నాగార్జున సర్కిల్‌లో ట్రాఫిక్ జామ్ అవుతుందని, అక్కడ మల్టీప్లెక్స్‌కు అనుమతులు ఇవ్వవద్దని చెప్పారు.

 KTR on GHMC development in TS Assembly

ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, ఎందుకో చెప్పాలని నిలదీశారు. అక్కడ ఉన్న 450 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకోవాలని, అప్పుడు అక్కడ లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టవచ్చునన్నారు.

విశ్వనగరం కావాలంటే..

హైదరాబాదు విశ్వనగరం కావాలంటే రాత్రి లైట్లు ఉండాలని బీజేపీ సభ్యులు రామచంద్రా రెడ్డి అన్నారు. కానీ ఎక్కడా ఎల్ఈడీ లైట్లు లేవని చెప్పారు. విశ్వనగరం అంటే లైట్లు కూడా కావాలన్నారు.

కిరణ్ రెడ్డి షాకింగ్, విభజనపై కోర్టుకు: పిటిషన్ స్వీకరణ, కేంద్రానికి సుప్రీం ఆదేశాలుకిరణ్ రెడ్డి షాకింగ్, విభజనపై కోర్టుకు: పిటిషన్ స్వీకరణ, కేంద్రానికి సుప్రీం ఆదేశాలు

చంద్రబాబే పారిపోయారు.. రేవంత్ ఎగిరిపడుతున్నాడు

కంటోన్మెంట్ అధికారులను కలుపుకొని వెళ్తున్నామని కెటిఆర్ చెప్పారు. బహుళ అంతస్తుల పార్కింగ్‌కు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. హైదరాబాదులో మార్పు తీసుకు వచ్చి చూపిస్తామన్నారు. తాము 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు.

స్వచ్ఛతలో దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. జీహెచ్ఎంసీలో సంస్కరణలు తీసుకు వచ్చామని చెప్పారు. అక్రమ నిర్మాణాల పైన ట్రైబ్యునల్ ఏర్పాటు చేశామన్నారు. అక్రమ నిర్మాణాల పైన భారీ జరిమానా విధిస్తున్నామని చెప్పారు.

ప్లాస్టిక్ రోడ్లతో ప్రయోగాలు చేస్తున్నామని చెప్పారు. గత వర్షాకాలంలో రోడ్లు చెడిపోయాయని, వాటిలో 90 శాతం మరమ్మతులు పూర్తయ్యాయని చెప్పారు. తమకు పేదవారు, పెద్దలు అందరూ ఒకటే అన్నారు.

అబద్దాలు చెప్పడం రేవంత్ రెడ్డికి కొత్త కాదన్నారు. వాళ్ల నాయకుడే ఇక్కడి నుంచి పారిపోయాడని, ఆయన మాత్రం ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాదును విషాద నగరం అని బీజేపీ సభ్యులు కిషన్ రెడ్డి అనడం సరికాదన్నారు. రాత్రికి రాత్రే ఏదీ విశ్వనగరం కాదన్నారు. హైదరాబాదులో పానిపట్టు యుద్ధాలు లేకుండా చేశామన్నారు.

నాగార్జునకు గిఫ్టులు ఇవ్వం

ఎన్ కన్వెన్షన్‌కు లేదా నాగార్జునకు గిఫ్టులు ఇచ్చే సంస్కృతి తమది కాదన్నారు. ఎవరికీ వెసులుబాటు ఇవ్వమి చెప్పారు. చట్టప్రకారం ఏం జరుగుతుందో అదే చేస్తామన్నారు. నాగార్జున సర్కిల్లో మల్టీ ప్లెక్స్ కట్టే విషయం తమ దృష్టికి రాలేదన్నారు.

రేవంత్ రెడ్డి అక్కడ మల్టీప్లెక్స్ కడుతున్నట్లు చెప్పారని, అది తమ దృష్టికి వస్తే చూస్తామన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ గురించి తన వద్ద సమాచారం లేదని, లేనిది ఉన్నట్లు చెప్పడం తనకు తెలియదని, సమాచారం వచ్చాక చెబుతానని అన్నారు.

English summary
Minister KT Rama Rao on GHMC development in TS Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X