ఇసుక అక్రమాలపై సర్జికల్ స్ట్రయిక్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇసుక అక్రమార్కులపైన సర్జికల్ స్ర్టయిక్స్ చేయాలని గనుల శాఖ మంత్రి కెటి రామారావు అధికారులకు అదేశాలు జారీ చేశారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో అక్రమ ఇసుక రవాణను అడ్డుకునేందుకు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖాల అధికారులతో జాయింట్ గ్రూపులు ఏర్పాటు చేసి తనీఖీలు చేపట్టలన్నారు. స్ధానిక అవసరాలపేరుతో ఇసుక డంపుల్లోని అక్రమ నిల్వలను సీజ్ చేయాలన్పారు. స్థానిక అవసరాలకు కాకుండా అక్రమంగా ఇసుక తరలించే వారిని, వారి వాహనాలను సీజ్ చేయాలన్నారు. నూతనంగా సాగునీటి రంగంలో నిర్మింస్తున్న బ్యారేజీల్లో మైనింగ్ కు అందుబాటులో ఉన్న ఇసుక తవ్వకాలపైన జిల్లా కలెక్టర్లతో సచివాలయం నుంచి విడియో కాన్పరెన్సు నిర్వహించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
KTR orders to surgical strike on Sand irregularities
Please Wait while comments are loading...