చిట్టినాయుడి ఫ్యామిలీ కథ చెప్పి.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ర్యాగింగ్!
ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ పదేపదే చిట్టి నాయుడు అంటూ సెటైర్లు వేస్తున్నారు . ఇక తాజాగా మరో మారు రేవంత్ రెడ్డి ఫ్యామిలీ కథ అంటూ అనగనగా ఓ చిట్టి నాయుడు అంటూ కథ చెప్పిన మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేశారు.
రేవంత్ టార్గెట్ గా కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఆయన కుటుంబ సభ్యులు రాష్ట్రంలో ఎక్కడికక్కడ స్వైర విహారం చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి హయాంలో అవినీతిమయంగా మారింది అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న భూదందాలు, సెటిల్మెంట్లు, హైడ్రా పేరు మీద వసూళ్లతో తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.

రేవంత్ కుటుంబ అవినీతి గురించి కథ చెప్పిన కేటీఆర్
రేవంత్ రెడ్డి దెబ్బకు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఢమాల్ అందని, ముఖ్యంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఘోరంగా దెబ్బ తిందని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రేవంత్ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఉద్దేశించి కథ చెప్పారు.
చిట్టి నాయుడి కథ చెప్పిన కేటీఆర్
ఇక చిట్టి నాయుడు కథ ఎందుకు చెబుతున్నాను అంటే అని మొదలుపెట్టిన కేటీఆర్ మాదాపూర్ లో ఉన్న తిరుపతిరెడ్డి ఆఫీసుకు రోజుకు రెండు వందల మంది వచ్చి పోతున్నారని, అయ్యప్ప సోసైటీలో తిరుపతి రెడ్డి ట్యాక్స్ నడుస్తుందని ఒకప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న, ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిక ఎమ్మెల్యే చెప్పారన్నారు. చిట్టి నాయుడు గారి ఏడుగురు అన్నదమ్ముల రాజ్యం నడుస్తుందని తనతో చెప్పాడని కేటీఆర్ గుర్తు చేశారు.
ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పిన కేటీఆర్
ఇక చిట్టి నాయుడి కథ అంటూ రేవంత్ రెడ్డి కుటుంబ కథను చెప్పిన కేటీఆర్ అనగనగా ఓ చిట్టి నాయుడు గారు.. ఆయనకు ఏడుగురు అన్నదమ్ములు.. తలా ఓ దిక్కు పంచుకున్నారని, తిరుపతి రెడ్డి అయ్యప్ప సొసైటీ మీద, కొండల్ రెడ్డి గుట్టల మీద పడ్డాడని, జగదీశ్ రెడ్డికి సడన్ గా 1000 కోట్లు వచ్చాయని, ఇంకో బామ్మర్దికి 1337కోట్ల కాంట్రాక్టు సీఎం తన డిపార్ట్మెంట్లోనే ఇచ్చారని వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ హయాంలో జరుగుతుంది ఇదే
ఈ దోపిడీ ఇలా కొనసాగుతుంటే సీఎం మాత్రం తనకు బుగ్గ కారు దొరికిందని, రాహుల్ గాంధీ పిలుస్తున్నాడని 22 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చాడని అది ఆయన గారు చేసిన గొప్ప పని అంటూ ఎద్దేవా చేశారు. మొత్తం తొమ్మిది నెలల కాలంలో ఒక్క కొత్త పథకం కూడా లేదని, పెన్షన్లు పెంచలేదంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే అంటూ రేవంత్ రెడ్డి పాలనను టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications