కర్ణాటక ఫలితాలపై స్పందించిన కేటీఆర్: కాంగ్రెస్‌పై ఇలా.. బీజేపీపై అలా!
హైదరాబాద్: కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకన్న కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ అభినందనలు తెలిపారు. అంతేగాక, బీజేపీని అధికారం నుంచి దించినందుకు కర్ణాటక ప్రజలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు.
''ది కేరళ స్టోరీ'.. కర్ణాటక ఓటర్లపై ప్రభావం చూపించడంలో పూర్తిగా విఫలమైంది. అదే మాదిరిగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు కూడా తెలంగాణపై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోయేది లేదు. నీచమైన, విభజన రాజకీయాలు తిరస్కరించిన కర్ణాటక ప్రజలకు నా ధన్యవాదాలు' అని మంత్రి కేటీఆర్ కర్ణాటక ఫలితాలపై స్పందించారు.

మరోవైపు, పెట్టుబడులు ఆకర్షించడం, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో హైదరాబాద్, బెంగళూరు నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. అది దేశానికి మంచి చేసేలా ఉండాలి. కర్ణాటక కొత్త ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు' అంటూ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరోవైపు, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపును పలువురు బీఆర్ఎస్ నేతలు స్వాగతిస్తూ ట్వీట్లు చేయడం గమనార్హం.
Just the way Kerala Story failed to amuse people of Karnataka, similarly Karnataka election results will have NO bearing on Telangana
— KTR (@KTRBRS) May 13, 2023
Thanks to the people of Karnataka for rejecting ugly & divisive politics 🙏
Let Hyderabad and Bengaluru compete healthily for investments &…
కాగా, కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు సాధించి అధికారం ఖాయం చేసుకుంది. 224 సీట్లు కలిగిన కర్ణాటక అసెంబ్లీలో 135కుపైగా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 60కిపైగా స్థానాలతో రెండో స్థానంలో బీజేపీ, 20కిపైగా స్థానాలు దక్కించుకున్న జేడీఎస్ మూడో స్థానంలో నిలిచాయి.
అయితే, కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి ఎవరు అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సీఎం పదవి కోసం పోటీపడుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని తానై పార్టీని గెలిపించిన శివకుమార్‌కే సీఎం పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, దీనిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేపు అంటే ఆదివారంరోజున నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications