‘కేటీఆర్ గారూ! ఏపీలోనూ పార్టీ పెట్టండి!’: ఏపీ నుంచి పిలుపుపై కేటీఆర్ ఆసక్తికరం
హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో తెలంగాణ మంత్రి కేటీ రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోటీ చేస్తానంటూ సరదాగా వ్యాఖ్యలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది అందరికి.
హైదరాబాద్/అమరావతి: హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో తెలంగాణ మంత్రి కేటీ రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోటీ చేస్తానంటూ సరదాగా వ్యాఖ్యలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది అందరికి. అయితే, ఇప్పుడు మాత్రం ఏపీ నుంచి పార్టీ పెట్టాలంటూ పలువురి నుంచి పిలుపులు రావడం గమనార్హం.
ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు తెలంగాణ ప్రభుత్వ పాలనను మెచ్చుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వ పనితీరు కంటే తెలంగాణ ప్రభుత్వ పనితీరు మెరుగ్గా ఉందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
కాగా, ఏపీకి చెందిన ఓ యువకుడు కేటీఆర్‌కు ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. 'కేటీఆర్ గారూ.. ఏపీ రాజకీయ నేతలతో విసుగెత్తిపోయాం.. ప్రభుత్వ పాలన నచ్చడం లేదు.. టీఆర్‌ఎస్ పార్టీని తెలంగాణలోనే కాదు.. ఏపీలో కూడా విస్తరించండి.. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాం' అంటూ ట్వీట్ చేశాడు.
We have more than enough to do in Telangana brother. Thanks for the kind comments though 🙏 https://t.co/t6YBME1duc
— KTR (@KTRTRS) April 3, 2017
ఆ యువకుడికి ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. 'మా రాష్ట్రంలోనే బోలెడన్ని పనులు ఉన్నాయి. వాటన్నింటిని నెరవేర్చాల్సిన బాధ్యత మాపై ఉంది. మా పాలనను గుర్తించినందుకు మీకు కృతజ్ఞతలు బ్రదర్' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కేటీఆర్ స్పందించిన తర్వాత తెలంగాణ, ఏపీల నుంచి నెటిజన్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఏపీ నెటిజన్లు టీఆర్ఎస్ పెట్టాలని పేర్కొనగా.. మరికొందరు తెలంగాణ నెటిజన్లు కేటీఆర్ స్పందనను మెచ్చుకుంటూ ట్వీట్లు చేశారు.












Click it and Unblock the Notifications