రేవంత్ రెడ్డి చిట్టినాయుడు; అధికారులకు, పోలీసులకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
రేవంత్ రెడ్డి ఏమి రాజు కాదని, చక్రవర్తి కాదని, ఆయనో చిట్టి నాయుడు అని, ఆఫ్ట్రాల్ ఆయనెంత అంటూ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కంటే మహా మహులతోనే కొట్లాడామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ పొరుబాటలో మాజీ మంత్రి కేటీఆర్
నేడు ఆదిలాబాద్ లో రామ్ లీలా మైదానంలో రైతన్నల కోసం బీఆర్ఎస్ పొరుబాట కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ పై తిరుగుబాటుకు సమర శంఖం పూరించామని తెలిపారు. రైతుల పక్షాన రైతు రుణమాఫీ కోసం, రైతు భరోసా కోసం ప్రభుత్వంతో పోరాటం చేశామని, మద్దతు ధర కోసం కేంద్రంతో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

వారి వెంట పడతాం .. వదిలిపెట్టం
గుజరాత్ లో పత్తికి మద్దతు ధర ఇచ్చినట్టే తెలంగాణ రాష్ట్రంలో కూడా పండించిన పత్తికి మద్దతు ధర ఇవ్వాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పతికి మద్దతు ధర ఇవ్వకపోతే స్థానికంగా ఉన్న బిజెపి ఎంపీ, ఎమ్మెల్యే వెంట పడతామని, వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఇక రైతుల సంక్షేమాన్ని మరచిపోయిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేదాకా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ ఒకరిని మించిన ఒకరు మోసగాళ్ళు
కాంగ్రెస్, బిజెపి రెండు ఒకటేనని, ఒకరిని మించిన ఒకరు మోసగాళ్లని కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుజరాత్ లో పత్తి పండించే రైతు రైతు కానీ ఆదిలాబాద్ లో పత్తి పండించే రైతు రైతు కాదా అంటూ ప్రశ్నించారు .గుజరాత్ లో ఇచ్చినట్టు తెలంగాణలో కూడా పత్తికి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అలా మద్దతు ధర ఇవ్వకపోతే బిజెపి ఎంపీ ఎమ్మెల్యేల వెంటపడతామని కేటీఆర్ తేల్చి చెప్పారు.
చట్టాన్ని అతిక్రమించి కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్న పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS స్ట్రాంగ్ వార్నింగ్ 🔥
— BRS Party (@BRSparty) October 24, 2024
అందరి పేర్లు రాసుకుంటున్నాం.. మిత్తితో సహా చెల్లిస్తాం. pic.twitter.com/4Tlvxo3HPh
వారికి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
రైతుబంధు, రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విధంగా అయితే పోరాటం చేస్తున్నామో అదేవిధంగా మద్దతుధర కోసం బిజెపి వెంట పడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో చట్టాన్ని అతిక్రమించి కొందరు ప్రభుత్వఅధికారులు, పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల మాదిరిగా పని చేస్తున్నారని పేర్కొని కేటీఆర్ వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అందరి పేర్లు రాసుకుంటున్నామని, మిత్తితో సహా చెల్లిస్తామని ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications