ఈడీ చీఫ్ గా బండి సంజయ్ నియామకం; పీఎంఓకు ధన్యవాదాలన్న కేటీఆర్; మామూలుగా ఇవ్వలేదుగా!!
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలని బీజేపీ, బీజేపీ దూకుడును కట్టడి చేయాలని టిఆర్ఎస్ ప్రయత్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. టిఆర్ఎస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ బిజెపి దూకుడుగా ముందుకు వెళుతుంటే, కేంద్రంలోని బిజెపి అసమర్థ విధానాలను ప్రజలకు తెలియజేస్తూ టిఆర్ఎస్ పార్టీ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకొని ఇరు పార్టీలు దూకుడుగా ముందుకు వెళుతున్న క్రమంలో ఒకరిని మించి ఒకరు తగ్గకుండా మాటల దాడిని కొనసాగిస్తున్నారు.

కేసీఆర్ ఈడీ విచారణ ఎదుర్కోక తప్పదు.. బండి సంజయ్ వ్యాఖ్యలు
తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా గోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీ లను ప్రారంభించిన క్రమంలో టిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కెసిఆర్ ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీతో కలవక తప్పడం లేదంటూ బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీ మీద జరుగుతున్న ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న నిరసనలకు కేసీఆర్ మద్దతు తెలపడం వెనక మతలబు ఇదేనంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
బండి సంజయ్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ .. ఈడీ చీఫ్ బండి సంజయ్ అంటూ
ఇక ఈ క్రమంలోనే బండి సంజయ్ చేసిన కెసిఆర్ పై ఈడీ విచారణ వ్యాఖ్యలకు తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా సమాధానమిచ్చారు. పదునైన సెటైర్లతో కేంద్రంపై నిత్యం దాడి చేస్తున్న కేటీఆర్ తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో మరోమారు కేంద్రాన్ని టార్గెట్ చేశారు. ప్రధాని కార్యాలయాన్ని అడ్రస్ చేస్తూ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను ఈడీ చీఫ్ గా కూడా నియమించినందుకు ధన్యవాదాలు అంటూ, పీఎంఓకు ధన్యవాదాలు తెలుపుతూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు మంత్రి కేటీఆర్.

ఇండియాను పరిగెత్తిస్తున్న డబుల్ ఇంజన్ మోడీ, ఈడీ అంటూ సెటైర్లు
ఇక ఇదే సమయంలో ఇండియాను పరిగెత్తిస్తున్న డబల్ ఇంజన్ మోడీ, ఈడీ అని మాకు ఇప్పుడే అవగతం అయ్యింది అంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. అంటే కేంద్రం కనుసన్నల్లో, ప్రధాని ఆదేశాల మేరకు ఈడి పనిచేస్తుందా అన్న భావన కలిగేలా కేటీఆర్ పోస్ట్ చేశారు. ఇక ఇదే సమయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సైతం కౌంటర్ చేశారు మంత్రి కేటీఆర్. ఇక మంత్రి కేటీఆర్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఇచ్చిన కౌంటర్ పై నెటిజన్లు చర్చిస్తున్నారు. మామూలుగా ఇవ్వలేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications