వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగూల్ సహా..: కెటిఆర్, త్వరలోనే ఆర్టీసి విభజన: మహేందర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గూగుల్ సహా మరికొన్ని ఐటి కంపెనీలు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు చెప్పారు. ఆయన మంగళవారంనాడు తాజ్ దక్కన్‌లో థాంసన్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ప్రారంభించారు.

హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున పలు కంపెనీల ఏర్పాటు కృషి చేస్తున్నామని తెలిపారు.ఐటీఐఆర్‌పై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన తప్పు పట్టారు.

KTR says several companies are coming to Hyderabad

ఇదిలావుంటే, త్వరలోనే ఆర్టీసీ విభజనను పూర్తి చేస్తామని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి మంగళవారంనాడు సమీక్ష నిర్వహించారు. సమీక్ష ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.

ఆర్టీసీ పాలకవర్గాన్ని నెలలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. పక్కరాష్ట్రం కంటే తెలంగాణలో బస్సు ఛార్జీలు తక్కువ అని తెలిపారు. ప్రజలపై భార మోపే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఉద్ఘాటించారు. తెలంగాణలో కొత్తగా 12 ఆర్డీవో కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు.

English summary
Telangana IT minister KT Rama Rao said that including google other IT companies are ready to invest in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X