వెంటాడుతాం , వేటాడుతాం - కేటీఆర్..!!

తెలంగాణ రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ పై చేయి సాధించేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. 14 ఎంపీ సీట్లు సాధించటమే లక్ష్యంగా సీఎం రేవంత్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. బీజేపీ ఈ సారి మెజార్టీ సీట్లలో గెలుపు పై ఫోకస్ చేసింది. మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 13 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సమయంలోనే సీఎం రేవంత్ లక్ష్యంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు.

హామీలు అమలు చేయాలి
కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వెంటాడుతాం.. వేటాడుతాం అని సీఎం రేవంత్‌ను కేటీఆర్ హెచ్చ‌రించారు. మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాజ‌కీయాల్లో కొన్ని సార్లు గెలుస్తాం.. కొన్నిసార్లు ఓడిపోతాం. గెలిచినంత మాత్రానా పొంగిపోవ‌ద్దు.. ఓడినంత మాత్రానా కుంగిపోయేది లేద‌న్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ప‌ని చేయాల‌ని ప్ర‌జ‌లు తీర్పు ఇచ్చార‌ని,. ఆ బాధ్య‌త నిర్వ‌ర్తిస్తూ ఎన్నో అంశాల‌పై పోరాటం చేస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు. రేవంత్ అధికారంలోకి రావ‌డానికి అర‌చేతిలో వైకుఠం చూపెట్టి 420 హామీలు ఇచ్చి గ‌ద్దెనెక్కారు విమర్శలు గుప్పించారు.

KTR sensationa comments against CM Revanth over six gurantees and Loksabha fight

రుణమాఫీ ఏమైంది
డిసెంబ‌ర్ 9న సీఎం కాగానే 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీపై సంత‌కం పెడుతాన‌ని రేవంత్ చెప్పారని గుర్తు చేసారు. సంవ‌త్స‌రంలో 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తాన‌ని చెప్పారన్నారు. ఇలా 420 హామీలు అడ్డ‌గోలుగా ఇచ్చి అధికారంలో కూర్చున్నారని మండిపడ్డారు. రైతుల‌కు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమ‌లు కాలేదన్నారు. రుణ‌మాఫీ గురించి ప్రస్తావ‌న లేదు అని కేటీఆర్ గుర్తు చేశారు. తన ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టే కుట్ర జ‌రుగుతుంద‌ని రేవంత్ రెడ్డి అంటున్నారని..రేవంత్ ప్ర‌భుత్వం ఐదేండ్లు ఉండాల‌ని కోరుకుంటున్నామని చెప్పారు. నీ ప‌క్క‌కే న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం మాన‌వ‌బాంబులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. నీ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టే ఖ‌ర్మ మాకు అవ‌స‌రం లేదని... ఆటోమేటిక్‌గా నువ్వు ఫెయిల్ అవుతావని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

ఆ రెండు పార్టీల పంతం
రేవంత్ కు ఇచ్చిన హామీలు నిల‌బెట్టుకునే తెలివి లేదన్నారు. రాష్ట్ర సంప‌ద‌ను పెంచే తెలివి లేదని.. ఫోన్ల ట్యాపింగ్స్ మీద పెట్టిన శ్ర‌ద్ద వాట‌ర్ ట్యాపింగ్స్ మీద పెట్టాలని సూచించారు. వాట‌ర్ ట్యాంక‌ర్లు తిరుగుతున్నాయని ఎద్దేవా చేసారు. కేసీఆర్ ఇంటంటికి నీళ్లు ఇచ్చిండు.. ఆ మాదిరిగా నువ్వు కూడా తాగునీళ్లు ఇవ్వు అని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే వారు పెట్టిన డ‌మ్మీ అభ్య‌ర్థిని ఓడించాలని పిలుపునిచ్చారు. మ్మీ అభ్య‌ర్థిని బీజేపీకి లాభం చేసేందుకు నిల‌బెట్టారు. సికింద్రాబాద్‌లో డ‌మ్మీ అభ్య‌ర్థి. క‌రీంన‌గ‌ర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేదు. బీజేపీ, కాంగ్రెస్ గెల‌వాలి. కేసీఆర్, బీఆర్ఎస్ ఉండొద్ద‌నేది ఈ రెండు పార్టీల పంతమని కేటీఆర్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+