వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగువారిపై దాడి: కేటీఆర్ దిగ్భ్రాంతి, ఇండియన్ సెనేటర్ల తీవ్ర స్పందన

అమరికాలో తెలుగువారిపై జరిగిన దాడులపై తెలంగాణ మంత్రి కేటీ రామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్మాది కాల్పుల్లో బుధవారం మృతి చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల,

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమరికాలో తెలుగువారిపై జరిగిన దాడులపై తెలంగాణ మంత్రి కేటీ రామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్మాది కాల్పుల్లో బుధవారం మృతి చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల, తీవ్రగాయాలపాలైన అలోక్ రెడ్డిల కుటుంబాలకు ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నా ప్రశ్నలకు బదులేది?: కన్నీటి పర్యాంతమైన శ్రీనివాస్‌ భార్య సునయన(వీడియో)నా ప్రశ్నలకు బదులేది?: కన్నీటి పర్యాంతమైన శ్రీనివాస్‌ భార్య సునయన(వీడియో)

ఇటీవల వరంగల్‌కు చెందిన వంశీ, రెండ్రోజుల క్రితం శ్రీనివాస్.. అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనలో మృతి చెందడం బాధాకరమనైన విషయమని మంత్రి కేటీఆర్ అన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. దాడులపై భారత విదేశాంగశాఖతో కలిసి చర్చిస్తామని తెలిపారు.

KTR Shocked & anguished by the spate of attacks in US

కన్సాస్ రాష్ట్రంలో ఒలాతేలో బుధవారం రాత్రి ఓ బార్‌లో జాతి విద్వేషంతో ఓ అమెరికన్ జరిపిన కాల్పుల్లో ఇంజినీర్ శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోగా, అలోక్ తీవ్రగాయాలపాలయ్యారు. గత 15రోజుల్లో అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లు ఇద్దరు తెలుగువారు మృతి చెందారు. ఫిబ్రవరి 12న కాలిఫోర్నియాలో వరంగల్‌కు చెందిన వంశీరెడ్డి ఓ యువతిని కాపాడబోయే ప్రయత్నంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే.

ఆ హత్యకు ట్రంప్‌కు సంబంధం లేదు: వైట్‌హౌజ్ సమాధానం ఇదిఆ హత్యకు ట్రంప్‌కు సంబంధం లేదు: వైట్‌హౌజ్ సమాధానం ఇది

ఇండియన్ అమెరికన్ సెనేటర్ల తీవ్ర స్పందన

జాతి విద్వేషంతో అమెరికన్ ఉన్మాది కాల్పుల్లో శ్రీనివాస్ కూచిభొట్ల మృతి చెందిన ఘటనపై అమెరికాలోని ఇండియన్ సెనేటర్లు తీవ్రంగా స్పందించారు. శ్రీనివాస్ హత్యను ఖండించిన వారు.. దేశంలోని మతిలేని హింసకు తావులేదని స్పష్టం చేశారు.

'కాన్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటన తీవ్రంగా బాధ కలిగించింది. బాధితుల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి, విద్వేషం విజయం సాధించకుండా చూడాల్సిన అవసరముంది' అంటూ భారత సంతతికి చెందిన కాలిఫోర్నియా సెనేటర్ కమల్ హరీస్ ట్వీట్ చేశారు.

'కాన్సాస్ కాల్పులతో ఛిన్నాభిన్నమైన కుటుంబం గురించే నేను బాధపడుతున్నా. మతిలేని హింసకు మన దేశంలో తావులేదు. జరిగిన ఘోరంతో నా గుండె పగిలింది' అని కాంగ్రెస్ మహిళ పరిమళ జయపాల్ చెప్పారు. మరో ఇండియన్ అమెరికన్ చట్ట సభ్యుడు రో ఖన్నా దాడి ఘటనను ఖండించారు. ట్రంప్ ఎన్నికైన తర్వాత దేశంలో నేరాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

English summary
Telangana Minister KT Rama Rao has Shocked & anguished by the spate of attacks in US. Vamshi last month, Srinivas & Alok now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X