సీఎం రేవంత్ రెడ్డి జోకర్.. ఫేక్ న్యూస్ పెడ్లర్: కేటీఆర్ తీవ్రవ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బిఆర్ఎస్ ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది. రెండు పార్టీల నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో అన్నింటిలోనూ వైఫల్యం చెందుతుందని ప్రజలను హామీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని బిఆర్ఎస్ పార్టీ మండిపడుతోంది.
కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
ముఖ్యంగా కేటీఆర్ బిఆర్ఎస్ ను పదేపదే టార్గెట్ చేస్తున్నారు. తాజాగా నిజాలను బట్టబయలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతున్నారని, అధికార పార్టీ నాయకులే తప్పుడు ప్రచారం చేస్తే వారిపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. తాజాగా సోషల్ మీడియా వేదిక మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు.

రేవంత్ రెడ్డి అనే జోకర్ నకిలీ కథనం సృష్టించాడు
రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అయి ఉండి కూడా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటూ కేటీఆర్ మండిపడ్డారు. నా బంధువుకు 1000 కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని మండిపడ్డారు సచివాలయంలో నిజాం ఆభరణాలను నేను తవ్వినట్టు రేవంత్ రెడ్డి అనే జోకర్ నకిలీ కథనాన్ని సృష్టించాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఫేక్ న్యూస్ పెడ్లర్ రేవంత్ రెడ్డి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియోను సర్క్యులేట్ చేయించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సీఎం హోదాలో ఉస్మానియా యూనివర్సిటీ ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేసిన వ్యక్తి రేవంత్ అని, ఇలాంటి ఫేక్ న్యూస్ పెడ్లర్ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఎందుకు జైల్లో పెట్టకూడదు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో ఫేక్ ఎక్కడైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీలోనే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు
టిఎస్ఆర్టిసి లోగో మార్చింది మీరే, రవాణా శాఖ మంత్రి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసింది మీరే, మీడియాకు రిలీజ్ చేసింది మీరే, ఆ తర్వాత అక్రమ కేసులు పెట్టింది మీరే అంటూ రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అంటూ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా దుయ్యబట్టారు.
మిమ్మలి తప్పకుండా కోర్టుకీడుస్తాం
అంతే కాదు కాంగ్రెస్ కు అనుబంధం గా ఉన్న హ్యాండిల్స్ పైన, కొత్త ఆర్టీసీ లోగోను చూపించిన మీడియా సంస్థల పైన ఎందుకు కేసులు పెట్టడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా వేధింపులను కొనసాగిస్తే మేము తప్పనిసరిగా మిమ్మల్ని కోర్టుకీడుస్తామని కేటీఆర్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications