Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేటీఆర్ కమీషన్ల వ్యాఖ్యలతో తెలంగాణాలో కొత్త చర్చ

తెలంగాణ శాసనసభ సమావేశాలలో వాడి వేడి మాటల యుద్ధం కొనసాగింది. శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య ప్రచ్చన్న యుద్ధానికి కారణమయ్యాయి. బయట ప్రజలలోనూ కమీషన్ల వ్యవహారంపై చర్చకు వేదికగా మారాయి.

సభలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మాటల యుద్ధం
శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా బీఆర్ఎస్ సభ్యులు పల్లె రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వం పని తక్కువ ప్రచారం ఎక్కువ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తప్పుపట్టారు. ప్రత్యర్థి పార్టీలు ఇటువంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.

ktr shocking comments on commissions bhatti reverse attack in assembly

కమీషన్లు లేకుండా పనులు చేయటం లేదన్న కేటీఆర్
ఇక ఇదే అంశం పైన జోక్యం చేసుకున్న మాజీ మంత్రి కేటీఆర్ మంత్రులు ప్రతిసారి సభ్యుల ప్రసంగాలకు అడ్డు తగలవద్దు అని చెబుతూనే, ఈ ప్రభుత్వంలో కమిషన్లు లేకుండా పనులు జరగడం లేదని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కమీషన్ల ఆరోపణలపై ప్రస్తుతం రాష్ట్రంలో దుమారం కొనసాగుతుంది.

30, 20 శాతం కమీషన్లపై కేటీఆర్
30% కమిషన్లు అని వాళ్ళ ఎమ్మెల్యేలు చెబుతున్నారని, 20 శాతం కమిషన్లని సచివాలయంలో ధర్నాలు చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం జరగగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కౌంటర్ ఇస్తూ బీఆర్ఎస్ నేతలు శాసనసభను, రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క

Take a Poll

కేటీఆర్ వ్యాఖ్యలకు భట్టి కౌంటర్
30 శాతం కమిషన్ అంటున్న కేటీఆర్ నిరూపించాలంటూ ఛాలెంజ్ విసిరారు. లేదంటే శాసనసభకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం 40 వేల కోట్ల రూపాయల పనులు చేయించి బిల్లులు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో మీ పాపం వల్లే బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఏడుస్తున్నారని బి ఆర్ ఎస్ నేతలను ఉద్దేశించి భట్టి విక్రమార్క వ్యాఖ్యలు చేశారు.

ఎవరొచ్చినా ఇంతేనా?
ప్రస్తుతం తాజాగా జరిగిన శాసన సభలో ఇరు పార్టీల నేతలు చేసుకున్న ఆరోపణలు ఇప్పుడు తెలంగాణా సమాజంలో చర్చకు దారి తీశాయి. ప్రజా ధనాన్ని సవ్యంగా వినియోగించాల్సిన చోట ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దుర్వినియోగమే జరుగుతుందని చర్చ ప్రధానంగా మారింది. ఒకరు చేస్తున్న తప్పులు మరొకరు ఎత్తి చూపుతూ ప్రజల ధనాన్ని, శాసనసభ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+