సీఎం ఫైల్‌కే దిక్కులేదు, కాంగ్రెస్ మాటలు ఎవరు నమ్ముతారు?: KTR
తెలంగాణ శాసనసభ వేదికగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడూతూ.. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా సీఎం సంతకం చేసిన 'ఆరు గ్యారంటీల' దస్త్రం ఎక్కడికి పోయిందంటూ ఆయన వేసిన ప్రశ్నలు సభలో కాకరేపాయి.
ప్రసంగం ప్రారంభంలోనే ఆధ్యాత్మిక, చారిత్రక అంశాలను ప్రస్తావిస్తూ కేటీఆర్ సెటైర్లు వేశారు. "నేనే రాజు.. నేనే మంత్రి అని మిడిసిపడ్డ వారు ఎవరూ కూడా సంపదను మూటగట్టుకుపోలేరు. చరిత్రలో ఎందరో రాజులు దర్పాన్ని, గర్వాన్ని ప్రదర్శించారు కానీ ఏదీ శాశ్వతం కాదు. శిబి చక్రవర్తి లాంటి వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని చరిత్రలో నిలిచారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే పాలకులకు విశ్వసనీయత ఉంటుంది. ఎవరూ వెయ్యి ఏళ్లు ఉండరు.. మేమూ పదేళ్లు అధికారంలో ఉన్నాం, ఇప్పుడు విపక్షంలో ఉన్నాం. ఇది అందరూ గుర్తుంచుకోవాలి" అని హితవు పలికారు.

మాయమైన దస్త్రం.. సిట్‌కు డిమాండ్!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ఆరు గ్యారంటీలపై చేసిన తొలి సంతకాన్ని కేటీఆర్ టార్గెట్ చేశారు. "తొలి క్యాబినెట్‌లోనే ఆరు హామీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. బహిరంగ వేదికపై సీఎం సంతకం చేసిన ఆ దస్త్రం ఏమైంది? అది ఎఫ్‌ఎస్‌ఎల్ అగ్నిప్రమాదంలో కాలిపోయిందా? లేక మాయమైందా? ఆ మాయమైన దస్త్రం కోసం ప్రత్యేకంగా 'సిట్' (SIT) వేయాలి" అని ఎద్దేవా చేశారు. సీఎం సంతకానికే దిక్కులేకపోతే, ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ కార్డులకు, డిక్లరేషన్లకు 'జీరో వ్యాల్యూ' అని ఘాటుగా విమర్శించారు.
ఢిల్లీకి నిధులు ఇస్తున్నారా? తెస్తున్నారా? : KTR
కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటనలపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. "కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి నిధులు తెస్తారనుకుంటే.. ఇక్కడి నుంచి నిధులు ఇచ్చి వస్తున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కేంద్రం నుంచి నిధులు తక్కువగా వచ్చినా రాష్ట్రాన్ని ధీటుగా నిలబెట్టాం. మనది కేంద్రంపై ఆధారపడే రాష్ట్రం కాదు" అని స్పష్టం చేశారు. ఐటీ ఉద్యోగాల గణాంకాలపై కూడా కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. 2023లో 9.46 లక్షలుగా ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య.. తాజా గవర్నర్ ప్రసంగంలో 9.39 లక్షలకు తగ్గిందని, అంటే కాంగ్రెస్ వచ్చాక 7 వేల ఉద్యోగాలు పోయాయని ఆయన ఆరోపించారు.
విశ్వసనీయత కోల్పోయిన ప్రభుత్వం!
గవర్నర్ ప్రసంగానికి కనీస విలువ, విశ్వసనీయత లేకుండా చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఆలోచనలు అందులో ప్రతిబింబించడం లేదని విమర్శించారు. ప్రజల ఆస్తుల విలువను జీరో చేశామని ప్రభుత్వం చెబుతోందని, కానీ వాస్తవానికి విశ్వసనీయత కోల్పోయిన ఈ ప్రభుత్వానికే జీరో వ్యాల్యూ ఉందని కేటీఆర్ తన ప్రసంగంతో సభలో కాంట్రవర్సీని రాజేశారు.
🟢 ఆనాడు గవర్నర్ గారి తొలి ప్రసంగంలో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించామని చెప్పారు.
— KTR News (@KTR_News) March 17, 2026
🟢 రేవంత్ రెడ్డి తొలి సంతకం చేసిన ఆరు గ్యారంటీల ఫైలు ఎటు పోయింది? ఎఫ్‌ఎస్‌ఎల్ అగ్నిప్రమాదంలో కాలిపోయిందా?
🟢 తొలి కేబినెట్ సమావేశాల్లో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత అని రాహుల్ గాంధీ చెప్పిన మాట… pic.twitter.com/pYoTdxtMaK












Click it and Unblock the Notifications