రూటు మార్చి ఆటో ఎక్కిన కేటీఆర్... ఎందుకంటే!
తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూట్ మార్చారు. తెలంగాణ ప్రభుత్వాన్ని నిత్యం టార్గెట్ చేస్తున్న కేటీఆర్ రాష్ట్రంలో విభిన్న వర్గాల వాళ్ళు చేస్తున్న ఆందోళనలకు మద్దతు తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సర్వీసులతో తాము దారుణంగా నష్టపోయామని ఆటో డ్రైవర్లు చేస్తున్న నిరసనలకు మద్దతు తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్.
ఆటోలో ప్రయాణం చేసిన కేటీఆర్
ఈ ఆందోళనలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆటోలో ప్రయాణించారు. తద్వారా ఆటో డ్రైవర్లకు తన మద్దతును ప్రకటించారు. ఇక కేటీఆర్ తో పాటు ఆటో కార్మికుల మహా ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు కూడా ఆటోలలోనే చేరుకుని ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఆటోవాలాల పరిస్థితి దారుణంగా ఉంది: కేటీఆర్
ఇందిరా పార్క్ దగ్గర ధర్నాచౌక్ లో ఆటో డ్రైవర్స్, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ జేఏసీ నిర్వహించిన మహా ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ఆటోవాలాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తాను ధర్నా చౌక్ దగ్గరకు ఆటోలో వచ్చానని పేర్కొని, తాను ఎక్కిన ఆటో డ్రైవర్ తమ జీవితాలను ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా దారుణంగా చేసిందో చెప్పారని పేర్కొన్నారు.
ఆటో కార్మికుల మహా ధర్నాకి ఆటోలో ప్రయాణించి ఇందిరాపార్క్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు pic.twitter.com/CEjepgZlJh
— BRS Party (@BRSparty) November 5, 2024
కాంగ్రెస్ హయాంలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు మొదలు
లక్షల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని పేర్కొన్న కేటీఆర్ గతంలో రాహుల్ గాంధీ ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు .తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయని ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కూడా మొదలయ్యాయని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇందిరా పార్క్ వద్ద 🛺"ఆటో డ్రైవర్ల మహాధర్నా"🛺లో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.
— BRS Party (@BRSparty) November 5, 2024
కేటీఆర్ కామెంట్స్ 👇
♦️ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఎన్నడూ అనుకొలే.
♦️గత పదేళ్లలో కేసీఆర్ గారి హయాంలో అభివృద్ధి ఫలాలు అనుభవించామని… రోజుకు… pic.twitter.com/fkEL9KWbQS
నెలకు ఆటో డ్రైవర్ లకు 5 వేలు ఇవ్వాలని డిమాండ్
ప్రస్తుత పరిస్థితులలో ఆటో డ్రైవర్లు చనిపోకుండా ఉండాలంటే సంవత్సరానికి 12,000 కాదు నెలకు 5000 రూపాయలు ఇవ్వాలని, ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆటోలు, రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఇక ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ జేఏసీ నిర్వహించిన ఈ ధర్నాకు సిఐటియు, ఎఐసియూటీ ,బిఆర్టియు, టియుసిఐ, జియుసిఐ, యుటిఏడిడబ్ల్యూఏ, టిఏడిఎస్ లాంటి కార్మిక సంఘాలు మద్దతు తెలిపి ఈ మహా ధర్నాలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications