నాంపల్లి మల్టీలెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్‌పై కేటీఆర్ ట్వీట్.. రేవంత్ రెడ్డికి ఇంట్రెస్టింగ్ ప్రతిపాదన

హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతోంది. గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రధాన సమస్యగా ఉన్న పార్కింగ్ సమస్యను పరిష్కరించడం కోసం గత ప్రభుత్వం నాంపల్లి మెట్రో స్టేషన్ పక్కన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది.

మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై స్పందించిన కేటీఆర్
అయితే ఈ మల్టీ లెవెల్ కారు పార్కింగ్ కాంప్లెక్స్ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్టు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఇక దీనిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో పూర్తిస్థాయి ఆటోమేటెడ్, కంప్యూటరైజ్ద్ మల్టీ లెవెల్ పార్కింగ్ పనులు దాదాపు పూర్తి కావడం పట్ల ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.

KTR tweet on Nampally multilevel car parking complex Interesting proposal for Revanth Reddy

80 కోట్లతో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్
పిపిపి విధానంలో నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మించాలని 2016 - 2017 లో నిర్ణయం తీసుకున్నామని చెప్పిన కేటీఆర్ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమైందని. అయినా ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు పూర్తి కావచ్చిందని తెలిపారు. నాంపల్లి మెట్రో స్టేషన్ కు సమీపంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో హెచ్ ఎం ఆర్ ఎల్ కు చెందిన అరెకరం స్థలంలో 15 అంతస్తులలో 80 కోట్లు వెచ్చించి ఈ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు.

10 అంతస్తుల్లో వాహనాల పార్కింగ్
మెస్సర్స్ భారీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ ప్రాజెక్టును నిర్మించింది. ఇందులో 10అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ సౌకర్యం, 5అంతస్తుల్లో కమర్షియల్ షాపులు, రెండు స్క్రీన్ లతో కూడిన సినిమా థియేటర్ ఉంటాయి. మొత్తం ఒక లక్షా 44వేల 440 చదరపు అడుగుల విస్తీర్ణంలో 68శాతం పార్కింగ్ కు, 32% వాణిజ్య సముదాయాలకు కేటాయిస్తున్నారు. ఇక ఈ పార్కింగ్ స్థలంలో 250 కార్లు 200 ద్విచక్ర వాహనాలు పెట్టుకోవచ్చని చెబుతున్నారు.

అనేక కారణాలతో ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం
దేశంలోనే ప్రప్రథమంగా జర్మన్ పాలిస్ పార్కింగ్ విధానంలో తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్కింగ్ చేసేలా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినట్టు చెబుతున్నారు. కరోనా విజృంభించిన సమయంలో , ఫైనాన్సింగ్ సమస్యల కారణంగా, గ్లోబల్ సప్లై చైన్ అంతరాయాల వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం జరిగిందని అధికారులు గతంలోనే చెప్పారు.

రేవంత్ సర్కార్ ముందు కేటీఆర్ ప్రతిపాదన
ఇక ఎట్టకేలకు ఈ కారు పార్కింగ్ ప్రాజెక్టు పూర్తి కావడంపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వం ముందు ఆసక్తికర డిమాండ్ పెట్టారు. రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని ముందుకు తీసుకు వెళుతుందని ఆశిస్తున్నట్టుగా చెప్పిన ఆయన తాము అనుకున్నట్టు నగరంలోని కీలకమైన జంక్షన్లు, మెట్రో స్టేషన్లు, వాణిజ్య కేంద్రాలలో మరిన్ని మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ లను అందుబాటులోకి తీసుకొస్తారని తాము ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+