ఆగస్టు 2 డెడ్ లైన్ - ప్రభుత్వానికి కేటీఆర్ అల్టిమేటం..!!
కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అల్టిమేటం జారీ చేసారు. వచ్చే నెల 2వ తేదీ లోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం స్పందించకుంటే 50 వేల మంది రైతులతో వచ్చి తామే పంప్‌హౌస్‌లు ఆన్ చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ బీడు భూములను నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం ప్రజలు, రైతులను ఇబ్బందులు పెట్టొద్దన్నారు.
పంప్ హౌస్ పరిశీలన
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్‌ను కేటీఆర్ పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కల్పతరువన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులం ప్రాజెక్టును పరిశీలించామని చెప్పారు.కేవలం రాజకీయ కక్షతో, కేసీఆర్‌ను బద్నాం చేయాలనే పంపులను ఆన్ చేయడం లేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే లోపు కాళేశ్వరం పంప్‌హౌస్‌లు ఆన్ చేయాలన్నారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనంత వేగంగా కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని చెప్పుకొచ్చారు.

కరువు నివారణ కోసం
తెలంగాణలో కరువు అనే మాట వినపడొద్దని ఈ ప్రాజెక్టును నిర్మించారన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ఎప్పుడూ నీటి సమస్య లేదని వివరించారు. గతంలో నీటి సమస్య ఉండేదని రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఈ ప్రభుత్వం పంటల సాగు కోసం నీరు ఇచ్చే పరిస్థితి లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. శ్రీరాంసాగర్‌లో నీళ్లు లేవు, ఎల్‌ఎండీలో 5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయన్నారు. మిడ్ మానేరులోనూ 5 టీఎంసీలు.. శ్రీరాంసాగర్ సామర్థం 90 టీఎంసీలు అయితే ఇప్పుడు 25 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని వివరించారు.
కేటీఆర్ పిలుపు
కాళేశ్వరం ప్రాజెక్టుతో కరువు ప్రాంతాలకు సాగునీరు అందుతుందని చెప్పారు.. హైదరాబాద్‌కు కూడా మంచినీళ్లు అందించొచ్చని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూడు రోజులకు ఒకసారి తాగునీరు అందిస్తున్నారన్నారు. పది లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా కిందకు పోతున్నాయని వివరించారు. కాళేశ్వంరం దగ్గర గోదవారి ఉధృతంగా ప్రవహిస్తున్నది. రిజర్వాయర్లు మాత్రం గొంతెండి ఎడారిలాగా మారాయని కేటీఆర్ విమర్శించారు. ఆరు నెలలు రాజకీయం చేద్దాం.. నాలుగున్నరేండ్లు ప్రజల కోసం కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications