ఇంత అధ్వాన్నమా?: నగర రోడ్లపై తిరిగిన కెటిఆర్, రూ.5 భోజనం తిన్నారు(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలోని రహదారుల అధ్వాన్న స్థితిని ప్రత్యక్షంగా తిలకించిన ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు.. అధికారుల వైఖరిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా భూగర్భ విద్యుత్ కేబుళ్ల నెపంతో రోడ్ల వెంట విచ్చలవిడిగా తవ్వకాలు జరుపగా, ఆపై కురిసిన వర్షాలకు కిలోమీటర్ల కొద్దీ రోడ్లు నరకాన్ని తలపించేలా పాడైపోయిన విషయం తెలిసిందే.

వివిధ మీడియా ఛానళ్లు, పత్రికల్లో రోడ్ల దుస్థితిపై విరివిగా కథనాలు రాగా, ఆదివారం అమెరికా పర్యటనను ముగించుకు వచ్చిన మంత్రి కేటీఆర్.. యూసఫ్‌గూడ, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి రోడ్లను పరిశీలించారు.

రోడ్డు వేసిన కాంట్రాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాణ్యత లేని రహదారుల వల్లే ఈ పరిస్థితి నెలకొందని, విద్యుత్ విభాగం, జీహెచ్ఎంసీ అధికారుల మధ్య సమన్వయం లోపం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని అసహనాన్ని వ్యక్తం చేశారు.

మూడు నుంచి ఆరు అడుగుల లోతులో తవ్విన పొడవాటి గుంతలను చూసి, స్కూళ్లు తెరచిన వేళ, ఎవరైనా పిల్లలు అందులో పడిపోతే, ఎవరిది బాధ్యతంటూ అధికారులపై కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సాయంత్రంలోగా మరమ్మతులు చేయాలని ఆదేశించారు. కేటీఆర్ వెంట హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ తదితరులు ఉన్నారు.

రూ. 5 భోజనం చేసిన మంత్రి కెటిఆర్

రోడ్ల తనిఖీల్లో భాగంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో షాపూర్‌నగర్‌లో నిర్వహిస్తున్న రూ.5 భోజనం కౌంటర్‌ను మంత్రి కెటిఆర్ పరిశీలించారు. క్యాంటీన్‌లో భోజనం కూడా చేశారు. మంత్రితో పాటు ఎంపీ మల్లారెడ్డి, మేయర్ రామ్మోహన్, ఎమ్మెల్యే వివేకానందగౌడ్ భోజనం చేశారు.

హైదరాబాద్ రోడ్లపై కెటిఆర్

హైదరాబాద్ రోడ్లపై కెటిఆర్

హైదరాబాద్ నగరంలోని రహదారుల అధ్వాన్న స్థితిని ప్రత్యక్షంగా తిలకించిన ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు.. అధికారుల వైఖరిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

హైదరాబాద్ రోడ్లపై కెటిఆర్

హైదరాబాద్ రోడ్లపై కెటిఆర్

గత రెండు నెలలుగా భూగర్భ విద్యుత్ కేబుళ్ల నెపంతో రోడ్ల వెంట విచ్చలవిడిగా తవ్వకాలు జరుపగా, ఆపై కురిసిన వర్షాలకు కిలోమీటర్ల కొద్దీ రోడ్లు నరకాన్ని తలపించేలా పాడైపోయిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ రోడ్లపై కెటిఆర్

హైదరాబాద్ రోడ్లపై కెటిఆర్

వివిధ మీడియా ఛానళ్లు, పత్రికల్లో రోడ్ల దుస్థితిపై విరివిగా కథనాలు రాగా, ఆదివారం అమెరికా పర్యటనను ముగించుకు వచ్చిన మంత్రి కేటీఆర్.. యూసఫ్‌గూడ, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి రోడ్లను పరిశీలించారు.

హైదరాబాద్ రోడ్లపై కెటిఆర్

హైదరాబాద్ రోడ్లపై కెటిఆర్

రోడ్డు వేసిన కాంట్రాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాణ్యత లేని రహదారుల వల్లే ఈ పరిస్థితి నెలకొందని, విద్యుత్ విభాగం, జీహెచ్ఎంసీ అధికారుల మధ్య సమన్వయం లోపం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని అసహనాన్ని వ్యక్తం చేశారు.

ఆరంభమే: కెటిఆర్

హైదరాబాద్ మహాన‌గ‌రంలో ప‌నుల్లో పార‌ద‌ర్శ‌క‌త తీసుకొస్తామ‌ని కెటిఆర్అ న్నారు. ప‌నులు పూర్తి కావ‌డానికి విధించిన‌ కాల‌ప‌రిమితిని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తామ‌ని చెప్పారు. ఢిల్లీలో రోడ్ల అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్ర‌ణ కోసం అనుస‌రిస్తోన్న ఉత్త‌మ విధానాన్ని స‌మీక్షిస్తామని అన్నారు. నగర రోడ్లను బాగుప‌ర్చేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామ‌ని కేటీఆర్ తెలిపారు.

అధికారుల పనితీరు మరింత బాగుపడాలని ఆయ‌న అన్నారు. రోడ్ల దుస్థితిపై తాను ఈరోజు చేసిన ప‌ర్య‌ట‌న ఆరంభం మాత్ర‌మేన‌ని, ఇతర మంత్రులు, అధికారులు రానున్న రోజుల్లో పర్యటిస్తారని ఆయ‌న చెప్పారు. రోడ్ల ప‌రిస్థితిపై వివ‌ర‌ణ అందించ‌డానికి అధికారులు వారం రోజులు స‌మ‌యం అడిగారని ఆయ‌న పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+