Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మురళి హత్యతో చెదిరిన కుమార్‌పల్లి: ఒకప్పుడిలా..., తిరగబడిన చరిత్ర...

వరంగల్‌ : జూలై 13వ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్పొరేటర్‌ అనిశ్టెి మురళి హత్య కుమార్‌పల్లి ప్రాంతంలో ఒక సంచలనం రేకెత్తించింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న కుమార్‌పల్లి ప్రాంతం నిన్ని హత్యతో ప్రశాంతత చెదిరింది. అయితే గతంలో హన్మకొండలోని కుమార్‌పల్లి ప్రాంతం విప్లవ సాహిత్యానికి, రాడికల్స్‌ స్టూడెంట్ యూనియన్‌ విస్తరణకు, విప్లవానికి అంతేకాకుండా రౌడీయిజానికి కూడా పేరు పొందింది.

1991 ప్రాంతంలో అప్పటి కార్పొరేటర్‌ జనార్ధన్‌ను హత్య చేయడం సంచలనం రేపింది. ఈ హత్యలో నిన్న హత్యకు గురైన అనిశెట్టి మురళి ఒక ముద్దాయి. పాత కక్షల కారణంగానే నిన్న మురళి హత్యకు గురయ్యాడని పోలీసులు నిర్ధారించారు.

విప్లవానికి కేంద్రంగా ఉండి...

విప్లవానికి కేంద్రంగా ఉండి...

కుమార్‌పల్లి ప్రాంతం నుండి విప్లవ రచయిత వరవరరావు తమ సృజన మాస పత్రికను వెలువరించి ఎందరో యువకులను విప్లవ సాహిత్యంలోకి తీసుకువచ్చారు. అంతేకాకుండా ఎందరో యువకులను విప్లవంలోకి వచ్చే విధంగా ప్రేరేపించారు. 1991 సంవత్సరంలో కనీవినీ ఎరుగని రీతిలో వరంగల్‌లో జరిగిన రైతు కూలీ మహా సభలకు కుమార్‌పల్లి కేంద్ర బిందువై ఆ సమావేశాన్ని విజయవంతం చేయడంలో విప్లవకారులు, విప్లవ సాహిత్యకారులు, రాడికల్స్‌ స్టూడెంట్స్ యూనియన్‌ తమ పాత్రను పోషించాయి. ఒకప్పుడు వరంగల్ విప్లవోద్యమానికి కేంద్ర బిందువుగా ఉండేది. 1984 ప్రాంతంలో రౌడీషీటర్‌ గోపాల్‌రెడ్డి హత్య, 2004లో అప్పటి ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యకక్షుడు తోకల దేవేందర్‌రెడ్డిని అప్పటి మావోయిస్టులు కుమార్‌పల్లి ప్రాంతంలోనే హత్య చేశారు. విప్లవోద్యమ క్రమంలో వరంగల్‌లోని శివనగర్, కుమార్‌పల్లిలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తాజాగా కుమార్‌పల్లి చరిత్ర తిరగబడినట్లు కనిపిస్తోంది.

అంతకు ముందు ఇలా...

అంతకు ముందు ఇలా...

1996వ సంవత్సరంలో జనార్ధన్‌ భార్య శ్రీలత, కొడుకు విక్రంలు కలిసి తన భర్త హత్యకు కారకుడైన ఒక ముద్దాయి రమేష్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. జనార్ధన్‌ హత్య కేసులో అతని కుటుంబ సభ్యులు మురళిపై కక్ష కట్టి 2007వ సంవత్సరంలో అతడిపై దాడి చేసేందకు పధకం రచించగా విషయం పోలీసులకు తెలియడంతో ప్రాణాపాయం తప్పింది. అనిశ్టెి మురళికి సమకాలికుడైన చిన్న ఇీవల అనారోగ్యంతో మరణించడంతో అనిశెట్టి మురళి బలం తగ్గినట్టుగా జనార్ధన్‌ కుమారుడు భావించాడు. దీంతో జనార్ధన్‌ కొడుకు విక్రం అతని స్నేహితులతో కలిసి గురువారం రోజున పక్కా వ్యూహాత్మకంగా మురళిని చంపారు.

అప్పటి వరకు...

అప్పటి వరకు...

కుమార్‌పల్లి మార్కెట్ ప్రాంతంలో 1990 సంవత్సరంలో రౌడీషీటర్ల హవా నడిచింది. అప్పటి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, టీడీపీ నాయకుల వెనుక రౌడీషీటర్లే రాజ్యమేలేవారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ నేతగా జనార్ధన్‌ ఉన్నాడు. టీడీపీ నుంచి నారాయణ రావు అనే నాయకుడు ఉండేవాడు. వీరిద్దరి వెంట యువకులు, నేరచరిత్ర ఉన్న వారు ఉండేవారు. నారాయణ, జనార్ధన్‌ మధ్య ఆధిపత్య పోరు నడిచింది. ఆ సమయంలో నారాయణ కుడిభుజంగా అనిశెట్టి మురళి ఉండేవారు. ఈ క్రమంలోనే నారాయణరావు హత్యకు గురయ్యారు. ఈ హత్య జనార్ధన్‌ చేయించినట్లుగా ప్రచారం జరిగింది. తన గురువు నారాయణరావు హత్యతో మురళి రగిలిపోయాడు. ఆ తర్వాత 1992లో జనార్ధన్‌ కుమార్‌పల్లిలో హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో అనిశ్టెి మురళి, చిన్న, ఇతర రౌడీషీటర్లు నిందితులుగా ఉన్నారు.

 హెచ్చరిస్తూనే ఉన్నాడు...

హెచ్చరిస్తూనే ఉన్నాడు...

తన తండ్రి బొమ్మతి జనార్ధన్‌ అలియాస్‌ జెన్నీ హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు 2007లో హత్యాప్రయత్నానికి పాల్పడుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు మురళిని హెచ్చరించారు. తమ తండ్రిని చంపిన అనిశ్టెట్టి మురళిని ఎన్నటికైనా చంపి ప్రతీకారం తీర్చుకుంటామని పలు సందర్భాల్లో స్నేహితుల వద్ద చెబుతుండటంతో మురళి అప్రమత్తంగా వ్యవహరించారు. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉండి ఎలాంటి ఘటనలు జరగకపోవడంతో మురళి ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారు. రెండు నెలల క్రితం జెన్నీ 25వ వర్ధంతి సందర్భంగా తన తండ్రిని చంపిన అనిశెట్టి మురళిని ఎలాగైనా చంపి ప్రతీకారం తీర్చుకుంటానని విక్రం మరోసారి వ్యాఖ్యలు చేయడంతో మురళి అప్రమత్తమయ్యారు. తనకు జెన్నీ కుమారుల నుంచి ప్రాణ హాని ఉన్నదని రక్షణ కోసం గన్‌ లైసెన్స్‌ ఇవ్వాలని పోలీసులకు దరఖాస్తు చేసుకున్నట్లు మురళి సన్నిహితులు చెప్పారు. అనిశెట్టి మురళి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుమార్‌పల్లిలోని ఆయన స్వగృహానికి తీసుకవచ్చారు. ఈ సాయంత్రం కుటుంబ సభ్యులు దహనసంస్కారాలు నిర్వహించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+