Telangana: సీఎం రేవంత్ రెడ్డికి రూ.5.5 కోట్ల చెక్ ను అందజేసిన ఎల్ అండ్ టీ..

రాష్ట్రంలో నెలక్రితం కురిసిన భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగులో పంట నష్టంతో పాటు ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. దీంతో వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. భారీ ఎత్తున విరాళాలు ప్రకటించారు. తాజాగా లార్సెన్ అండ్ టూబ్రో(L&T) వరద బాధితులకు సాయం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5.5 కోట్ల విరాళం ఇచ్చారు.

బుధవారం తెలంగాణ సచివాలయంలో ఎల్అండ్ టీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎల్అండ్ టీ ప్రతినిధులు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సీఎం రేవంత్ రెడ్డిని చెక్కులు ఇచ్చారు. చిరంజీవి, తన కుమారుడు రామ్ చరణ్ వేర్వేరుగా రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించగా.. ఆ చెక్కులను అందించారు. మహేశ్ బాబు దంపతులు కూడా రేవంత్ రెడ్డిని కలిసి చెక్ అందించారు.

L amp amp T has given Rs 5 5 crore to the Chief Minister s Relief Fund to help the victims of Floods

బాలకృష్ణ చిన్న కూతురు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ఇచ్చారు. ఇలా టాలీవుడ్ చెందిన ప్రముఖులు ప్రకటించిన ప్రకారం చెక్కులు అందజేశారు. కుమారి ఆంటీ కూడా వరద బాధితుల సహాయం కోసం విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. కుమారి అంటీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 వేల చెక్కును ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆమె చెక్ అందజేశారు. ప్రజలను ఆదుకోవడానికి ముందుకొచ్చిన దాతలకు ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది.

కాగా కేంద్రం కూడా రాష్ట్రాలకు వరద సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. 14 రాష్ట్రాలకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ పండ్ అడ్వాన్స్ సాయం ప్రకటించారు. ఇందులో తెలంగాణకు రూ.416.80 కోట్లు ఇవ్వగా.. ఆంధ్రప్రదేశ్ కు రూ. 1,036 కోట్లు ఇచ్చారు. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా మహారాష్ట్రకు నిధులు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+