లడఖ్ ట్రక్కు ప్రమాదంలో తెలంగాణ జవాను మృతి
హైదరాబాద్: లడఖ్‌లోని లేహ్‌లో శనివారం జరిగిన ట్రక్కు ప్రమాద ఘటనలో అమరులైన సైనికుల్లో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ కూడా ఉన్నారు. భారత సైన్యం కాన్వాయ్‌లోని ఓ ట్రక్కు లోయలో పడిపోయి వీర మరణం పొందిన వారిలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందర్గు మండలం తిర్మాన్ దేవునిపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ శేఖర్ ఉన్నారు.
శేఖర్ అమరుడైన వార్తతో ఆయన కుటుంబంతోపాటు తిర్మాన్ దేవునిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శేఖర్ మృతి వార్త తెలిసినప్పటికీ నుంచి ఆయన భార్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లు ఉన్నారు. ప్రస్తుతం భార్య, పిల్లలు తిర్మాన్ దేవునిపల్ిలోనే ఉంటున్నారు.

2011లో భారత సైన్యంలో శేఖర్ చేరారు. శనివారం ప్రమాదవశాత్తు ట్రక్కు లోయలో పడిపోవడంతో మరో 9 మంది జవాన్లతోపాటు శేఖర్ కూడా వీరమరణం పొందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద ఘటనలో 8 మంది జవాన్లు, ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ మరణించారు.
లేహ్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని కియారీ వద్ద శనివారం సాయంత్రం 4.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో ఆర్మీ కాన్వాయ్‌లో ఐదు వాహనాలు ఉన్నాయని.. నది లోయలో పడిపోయిన ట్రక్కులో పది మంది జవాన్లు ఉన్నారని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా దళాలు, పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి.
హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటకీ.. తీవ్రగాయాలతో 9 మంది జవాన్లు మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక జవాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని తెలిపారు. ఆర్మీ జవాన్ల మృతి బాధాకరమని, దేశానికి వారు చేసిన అసాధారణ సేవలను ఎన్నటికీ మరవబోమని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.












Click it and Unblock the Notifications