యోని పూజకు రూ. 10లక్షలు.. లేడీ అఘోరి ఘరానా మోసాలు వెలుగులోకి..!
తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి వివాదం హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని నెలలుగా రెండు రాష్ట్రాల్లో విస్తృత పర్యటనలు చేస్తూ లేడీ అఘోరి హల్ చల్ చేస్తోంది. సనాతన ధర్మం, దేశ రక్షణ, మహిళల రక్షణ అంటూ.. తనపై ఎదురుతిరిగిన వారిపట్ల దురుసుగా ప్రవర్తిస్తూ బీభత్సం సృష్టిస్తోంది. అయితే తాజాగా లేడీ అఘోరి లీలలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. లేడీ అఘోరికి సంబంధించి ఓ షాకింగ్ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది.

యోని పూజ చేస్తానని.. రూ. 10 లక్షలు తీసుకుని తనను మోసం చేసినట్లు రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. లేడీ అఘోరీతో 6 నెలల క్రితం పరిచయం ఏర్పడిందని.. ఆమె మాటలు నమ్మి యోని పూజకు అంగీకరించానని వెల్లడించింది. ఆమె ఫిర్యాదు మేరకు లేడీ అఘోరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
జరిగింది ఇదే..
రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలంకు చెందిన లేడీ ప్రొడ్యూసర్.. లేడీ అఘోరి శివ విష్ణు బ్రహ్మ అట్లూరి మోసాలను ఒక్కొక్కటిగా బయటపెట్టింది. లేడీ అఘోరితో 6 నెలల క్రితం పరిచయం అయినట్లు ఫిర్యాదులో తెలిపింది. పరిచయం అయిన 2 నెలల తర్వాత ప్రొద్దటూర్ లోని ప్రగతి రిసార్ట్స్ కు డిన్నర్ కు వచ్చిందని.. అప్పటి నుంచి తరచుగా ఫోన్ చేస్తూ వ్యక్తిగత విషయాలను తెలుసుకునేదని తెలిపింది. ఒకసారి యోని పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మాయమాటలు చెప్పి నమ్మించిందని ఆ మహిళా ప్రొడ్యూసర్ వెల్లడించింది. లేడీ అఘోరీ మాటలు నమ్మి యోని పూజకు అంగీకరించానని తెలిపింది.

"పూజ ఖర్చుల కోసం రూ.5లక్షలు లేడీ అఘోరి అకౌంట్ లో వేశాను. ఆ తర్వాత పూజ కోసం యూపీలోని ఉజ్జయినిలోని ఫాం హౌస్ లోకి తీసుకెళ్లి పూజ చేసింది. మరుసటి రోజు మరో 5 లక్షలు తన అకౌంట్ లో వేయాలని లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరి భయపెట్టింది. అఘోరి మాటలకు భయపడిపోయి రూ. 5 లక్షలు అకౌంట్ లో వేశాను" అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధుతురాలు పేర్కొంది.












Click it and Unblock the Notifications