భూకబ్జా కేసులో లేడీ డాన్ అరెస్టు: బెయిల్‌పై తిరిగి వచ్చాక...
నకిలీ పత్రాలను సృష్టించి 400 గజాల ఇంటిని కబ్జా చేసిన లేడీ డాన్‌ను హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.
హైదరాబాద్: నకిలీ పత్రాలను సృష్టించి 400 గజాల ఇంటిని కబ్జా చేసిన లేడీ డాన్‌ను హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ ప్రకాష్ రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
బండ్లగుడ గౌస్‌నగర్ ఉందాహిల్స్ కాలనీలో సంతోష్‌నగర్ ఈదిబజార్‌కు చెందిన షేక్ వారీస్‌కు 400 గజాల ఇల్లు ఉంది. ఆ ఇంటిని ఫర్జానా బేబగం, మన్సూర్, మరో తొమ్మిది మందితో కలిసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

నిందితురాలిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రెండు రోజుల క్రితం పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్‌లో ఆమెను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాు. అయితే, ఆమె బెయిల్‌పై బయటకు వచ్చింది.
ఆ వెంటనే పోలీసులు ఆమెను మరో కేసులో అదుపులోకి తీసుకున్నారు. కబ్జాలకు పాల్పడుతున్న నిందితురాలిపై ల్యాండ్ గ్రాబింగ్ షీట్ తెరుస్తాని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications