వయస్సు తేడా ఉందని,పెళ్ళికి అడ్డు చెప్పారు,ప్రియురాలు ఇలా..
తమ పెళ్ళికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఓ యువతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొంది . ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకొంది.
భిక్కనూరు: ప్రేమ గుడ్డిది, ప్రేమకు కులమతాలు, వయస్సు తేడాలు ఉండవని సినిమాల్లో చూస్తుంటాం.వింటుంటాం. కాని, ఇదే తరహ ఘటన ఒకటి నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకొంది.
నిజామాబాద్ జిల్లాకు చెందిన 19 ఏళ్ళ యువతి తిప్పాపూర్ గ్రామానికి చెందింది. ఆమె తన దూరపు బంధువు ఒకతణ్ణి ప్రేమిస్తోంది.అతని వయస్సు 33 ఏళ్ళు.

అయితే అతడినే తాను వివాహం చేసుకొంటానని యువతి పట్టుబట్టింది. కాని, ఆ యువతి తల్లిదండ్రులు మాత్రం ససేమిరా అన్నారు. కాని తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేసి ఆమె విఫలమైంది.
ఇద్దరి మద్య వయస్సు తేడా సుమారు 14 ఏళ్ళు. వయస్సును కారణంగా చూపుతూ ఆ యువతి తల్లిదండ్రులు పెళ్ళికి అంగీకరించలేదు.
ఈ విషయమై తల్లిదండ్రులతో ఆ యువతి పలుమార్లు గొడవపడింది. గురువారం సాయంత్రం తిప్పాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications