లగచర్ల కేసు: పట్నం నరేందర్ రెడ్డి సహా రైతులకు బెయిల్ మంజూరు

లగచర్ల కేసులో నిందితుడిగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి నాంపల్లి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. నరేందర్ రెడ్డితోపాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో 24 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

పట్నం నరేందర్ రెడ్డి రూ. 50 వేల పూచీకత్తుపై, మిగితా రైతులకు రూ. 20 వేల పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో సూత్రధారిగా ఉన్న ఏ2 సురేశ్ తోపాటు మరొకరికి మాత్రం బెయిల్ నిరాకరించింది నాంపల్లి కోర్టు.

Lagacharla case Patnam Narender Reddy and other farmers granted bail

ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగితా రైతులు సంగారెడ్డి జైలులో ఉన్నారు. వీరంతా గురువారం విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఓ రైతుకు బేడీలు వేసిన ఘటన దుమారం రేపిన విషయం తెలిసిందే.

రైతులకు బేడీలు: సీఎం సీరియస్, అధికారులపై వేటు

సంగారెడ్డి సెంట్రల్ జైలులో రైతు హీర్యానాయక్‌కు బేడీలు వేసిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల ఎస్పీలతో కలిసి ఐజీ సత్యనారాయణ 4 గంటలపాటు జైలు సిబ్బందిని విచారించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతుకు బేడీలు వేయాల్సి వచ్చిందని ఐజీ సత్యనారాయణ తెలిపారు. హీర్యానాయక్‌‌ను జైలు నుంచి ఆస్పత్రికి తరలించే క్రమంలో జైలు అధికారులు ముందుస్తుగా వికారాబాద్ పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. నేరుగా సైబరాబాద్ పోలీసులకు సమాచారం పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు.

అయితే, హీర్యానాయక్‌ను లగచర్ల కేసులో నిందితుడిగా పేర్కొనలేదని.. బాలానగర్‌లోని ఓ కేసులో నిందితుడిగా ఉన్నారని చెప్పారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా? ేక పొరపాటు జరిగిందా? అనే కోణంలో పూర్తిస్థాయిలో విచారణ చేశామన్నారు. లగచర్ల కేసులో ఏ2గా ఉన్న సురేష్ జైలు నుంచి ఎవరితోనో ఫోన్లో మాట్లాడారని తెలిపారు.

హీర్యానాయక్ కు గుండె నొప్పి అని చెబితే బెయిల్ వస్తుందని సురేష్ చెప్పాడని ఐజీ తెలిపారు. అయితే, సురేష్ ఎవరితో మాట్లాడారనేదానిపై ఆరా తీస్తున్నామని ఐజీ సత్యనారాయణ తెలిపారు. ఇక, హీర్యానాయక్ కు బేడీలు వేసిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంగారెడ్డి జైలు సూపరిండెంట్సంజీవరెడ్డిని, జైలర్‌ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు జైళ్ల శాఖ ఐజీ సౌమ్యమిశ్రా ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+