అడ్డంగా దొరికిపోయిన లలితా జువెల్లరీ అధినేత..!
''డబ్బులు ఎవరికి ఊరికే రావు'' అంటూ ఈ ఒక్క డైలాగ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయ్యారు లలితా జువెల్లరీ అధినేత కిరణ్ కుమార్.ఈ ఒక్క మాటతో బంగారం కొనుగోలు చేసే వారిని తన వైపు తిప్పుకునేలా చేశారాయాన. మిగిలిన బంగారపు షాపులతో పోలిస్తే లలితా జువెల్లరీ షాపుల్లో తక్కువ ధర ఉంటేనే బంగారం కోనండి అంటూ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. అతి తక్కువ కాలంలోనే తనకంటూ సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారాయన.
లలితా జువెల్లరీ అంటే ప్రజల్లో ఓ నమ్మకం కలిగించారు.అయితే అలాంటి కిరణ్ కుమార్ జీఎస్టీ విషయంలో అడ్డంగా దొరికిపోయారు.లలిత జువెల్లరీ అధినేత కిరణ్ కుమార్ జీఎస్టీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పేరుతో ప్రభుత్వాన్ని బురిడి కొట్టించాలని చూశారు. జీఎస్టీ రిటర్న్స్‌లో మాత్రం తప్పుడు లెక్కలు చూపించి అధికారులకు దొరికిపోయారు. హైదరాబాద్ పంజాగుట్టలోని లలితా జువెల్లరీ 2017-18 సంవత్సరానికి జీఎస్టీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పేరుతో రూ. 56.61 కోట్లను క్లెయిమ్ చేసుకున్నారు. కానీ ఆయన సమర్పింటిన రిటర్న్స్ లెక్కల ప్రకారం రూ. 41.22 కోట్లే రావాల్సి ఉంది.

వాస్తవానికి రావాల్సన అమౌంట్‌కంటే రూ. 15.39 కోట్లు ఎక్కువ పొందినట్లు లెక్కల్లో తేలింది. ఇయర్ ఎండింగ్ లెక్కల్లో లలితా జువెల్లరీ అధినేత చేసిన స్కాం బయటపడటంతో స్టేట్ కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంటులోని జీఎస్టీ విభాగం అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. లలిత జువెల్లరీ సమర్పించిన జీఎస్టీ రిటర్న్స్ వివరాలను ఇవ్వాల్సిందిగా కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) సైతం ఆదేశాలు జారీ చేసింది.
దీనిపై స్పందించిన స్టేట్ కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంట్.. వాస్తవానికి రావాల్సన అమౌంట్‌కంటే రూ. 15.39 కోట్లు ఎక్కువ పొందినట్లు తేల్చారు. దీనిపై జీఎస్టీ విభాగం అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. అదనంగా పొందిన రూ. 15.39 కోట్లలో రూ. 14.85 కోట్ల మేర తిరిగి వచ్చిందని సంబంధిత అధికారులు తెలిపారు. మిగిలిపోయిన రూ. 53.52 లక్షలకు సంబంధించి డిపార్టుమెంటు అధికారులు ఇప్పటివరకూ వివరణ ఇవ్వలేదని తన నివేదికలో కాగ్ పేర్కొంది. డబ్బులు ఊరికే రావు... అంటూ ప్రజలకు సూక్తులు చెప్పే లలిత జువెల్లరీ అధినేత, తాను మాత్రం తప్పుడు లెక్కలు చూపించి ఏకంగా రూ. 15.39 కోట్లను పొందడం ఇప్పుడు సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications