హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముట్టుకుంటే బంగారమాయే.. ప్రభుత్వ లెక్కలే ఇలా : కో.. అంటే కోటి.!

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కాస్ట్‌లీ ఏరియా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్. ఎందుకంటే ఇక్కడ రాజకీయ నేతలు, బడా వ్యాపార వేత్తలు, సినీ ప్రముఖులు నివసిస్తుంటారు. అంతే కాక పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, 5 స్టార్ హోటల్స్, పబ్బులు, కార్పొరేట్ హాస్పెటల్స్, పలు కంపెనీలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. దీని తర్వాత జూబ్లీహిల్స్ రెండో స్థానంలో ఉంది. బాగా పైసలు ఉన్న బడా బాబులు మాత్రమే ఇక్కడ ఉంటారు.

 అత్యంత ఖ‌రీదైన ప్రాంతంగా బంజారాహిల్స్‌

అత్యంత ఖ‌రీదైన ప్రాంతంగా బంజారాహిల్స్‌


తాజాగా ప్రభుత్వ నిర్దేశించిన మార్కెట్ విలువల ప్రకారం అత్యంత ఖరీదైన ప్రాంతంగా బంజారాహిల్స్‌ తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ గతంలో చదరపు గజం విలువ రూ. 84,500లుగా ఉండేది. కానీ తాజా మార్కెట్ విలువల ప్రకారం ఈ వ్యాల్యూ రూ.1,14,100 అయింది. ప్రభుత్వ మార్కెట్ ప్రకారమే ఇంత ఖరీదు ఉంటే ఇక బహిరంగ మార్కెట్ విలువ‌ ఎంత ఉంటుందో అంచనా వేసుకోవచ్చు.

 రెండో స్థానంలో దినాన్‌దేవిడి

రెండో స్థానంలో దినాన్‌దేవిడి


హైదరాబాద్ పాతబస్తీలోని దివాన్‌దేవిడి రెండో స్థానంలో ఉంది. ఇక్కడ గతంలో చదరపు గజం రూ. 78 వేలు ఉండేది. కానీ ప్రభుత్వం తాజాగా పెంచిన విలువ ప్రకారం లక్షా 5 వేలకు పెరిగింది. ఇక తదుపరి స్థానాల్లో సికింద్రాబాద్ ఎస్సీ రోడ్, కాచిగూడ క్రాస్ రోడ్, రెజిమెంటల్ బజార్లు ఉన్నాయి. తర్వాత మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్న బేగంపేట, కుత్బూల్లాపూర్, కూకట్ పల్లి, మాల్కాజిగిరి, హబ్సీగూడ ఉన్నాయి. తర్వాత స్థానాల్లో రంగారెడ్డి జిల్లాలోని గడ్డి అన్నారం, మదీనాగూడ, ఎల్బీనగర్, ఖానామెట్, హయత్‌న‌గ‌ర్‌ ఉన్నాయి.

 ఏడు నెలలోపే రెండు సార్లు రిజిస్ట్రేషన్ విలువల పెంపు

ఏడు నెలలోపే రెండు సార్లు రిజిస్ట్రేషన్ విలువల పెంపు


తెలంగాణలో అసార్ట్ మెంట్లు, ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూముల రిజిస్టేషన్ విలువల పెంపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలకు .. విలువల పెంపు కమిటీలు ఆమోదముద్ర వేశాయి. 2021 జులైలో రిజిస్టేషన్ విలువలను పెంచిన ప్రభుత్వం.. ఏడు నెలలోపే మరలా మరోసారి రిజిస్ట్రేషన్ విలువలను పెంచింది. తాజా విలువల ప్రకారం అపార్ట్‌మెంట్ల 25 శాతం, ఖాళీ స్థలాలు 35 శాతం, వ్యవసాయ భూముల విలువ 50శాతం పెరగనున్నాయి.

 కో.. అంటే కోటి అన్నట్లుగా హైదరాబాద్ ల్యాండ్ విలువలు

కో.. అంటే కోటి అన్నట్లుగా హైదరాబాద్ ల్యాండ్ విలువలు


పెంచిన ధరలపై సామాన్యులు గగ్గోలు పడుతున్నారు. హైదరాబాద్ శివారల్లో 500 గజాలకు గజం 20 వేల చొప్పున గ‌తంలో కోటి రూపాయాలు అయ్యేది. దీని కి 6శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు ఉండేది . అంటే రూ. 6 లక్షలు సరిపోయేది. కానీ 2021 జూలైలో గజం విలువను మ‌రో రూ 10వేలు పెంచగా.. రిజిస్టేషన్ చార్జీ కూడా 7.5 శాతానికి పెరిగింది. దాంతో 500 గజాల స్థలం ధర రూ. 1.5 కోట్లకు పెరిగింది. దీనిపై రిజిస్టేషన్ చార్జీ కూడా రూ 11.25 లక్షలకు పెగింది. తాజాగా మరో సారి ఈ ధరలను మరలా పెంచారు. ప్రసుత్తం గ‌జం విలువ 45 వేలకు చేరింది. ఇప్పుడు అదే 500 గజాల స్థలం కొనాలంటే దాని ధర రూ 2.25కోట్లకు చేరింది. దీనిపై రిజిస్టేషన్ చార్జీ రూ 16.85లక్షలకు పెరిగింది.అంటే సంత్సరం తిరగకముందే కో.. అంటే కోటి అన్నట్లుగా హైదరాబాద్ ల్యాండ్ విలువలు పెరిగాయి.

Recommended Video

Hind Mazdoor Sabha : కార్మికులు కలిసి పోరాడితేనే ప్రభుత్వం దిగొస్తుంది | Oneindia Telugu
 సామాన్యుల సొంతింటి క‌లపై భారం.

సామాన్యుల సొంతింటి క‌లపై భారం.

ఇక సామన్య ప్రజలు తమ సొంత ఇంటి కల నేరవేర్చుకోవాలంటే ఎంత భారం మోయాలో ఉహించలేము. ఏడు నెలల కిత్రమే భూముల విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రెండింటినీ తెలంగాణ ప్రభుత్వం పెంచింది. తాజాగా మరోసారి ఈ ధరలను పెంచుతుంది. ఈ కొత్త ధరలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువలు , రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఒకవైపు బ్యాంకులు ఇళ్ల రుణాలపై వడ్డీలు తగ్గిస్తుంటే.. ప్రభుత్వం మాత్రం భూముల విలువ, రిజస్ట్రేషన్ చార్జీలు పెంచడంతో సామాన్య ప్రజలపై భారం పడుతుంది. తమ సొంత ఇంటి కల‌ నేరవేర్చుకోలేని పరిస్థితి నెలకొంటుంది. ఇక పోను పోనూ నెలవారి ఇంటి అద్దెకూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

English summary
Land and Housing rates double with in sevan months in Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X