రాత్రి పూట బయటికి రావొద్దు... వాతావరణ శాఖ వార్నింగ్ !!!
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగిపోతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోవడం సాధారణమే కాని ఈసారి వాతావరణం మరింత భిన్నంగా మారినట్టు కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు తక్కువగా నమోదవుతుండడంతో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. ఉదయం పూట పొగమంచు దట్టంగా కమ్ముకుంటుండగా.. సాయంత్రం ఆరు గంటల నుంచే చలి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. దీంతో సాయంత్రం వేళల్లో ప్రజలు బయట తిరగడానికి జంకుతున్నారు. చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి గిరిజనులు చలి మంటలు వేసుకుంటున్నారు.
వాతావరణ శాఖ అలర్ట్..
ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, తూర్పు తెలంగాణ, పశ్చిమ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు, రేపు చలిగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కాగా ఈ సమయంలో వైద్యులు ఆస్తమా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లకపోవడమే ఉత్తమమని వారు చెబుతున్నారు. అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని వెల్లడించారు.

అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. దట్టంగా పొగమంచు అలుముకోవడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోతున్నాయి. శనివారం మినుములూరు 5, అరకులో 5, అరకు 7, పాడేరు 7 డిగ్రీల చొప్పున అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మరో 3 రోజులు చలి గాలుల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని, చిన్నారులు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణలో సింగిల్ డిజిట్ కు పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు..
ఆదిలాబాద్.. 6.7
పటాన్ చెరువు.. 6 8
మెదక్.. 7.5
రాజేంద్ర నగర్.. 8.5
హనుమకొండ.. 10
హైదరాబాద్.. 11
రామగుండం.. 11.5
దుండిగల్.. 11.6
హయత్ నగర్.. 12
నిజామాబాద్.. 12
ఖమ్మం.. 13
నల్లగొండ.. 13.6
భద్రాచలం.. 14
మహబూబ్ నగర్.. 14.1
హకీమ్ పేట.. 15.5 డిగ్రీల చొప్పున శనివారం (డిసెంబర్ 13) ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications