హీరో ఆఫ్ ది డే నిరంజన్ రెడ్డి - "మెగా" పిలుపుతో, అక్కడే సీన్ ఛేంజ్..!!
నిరంజన్ రెడ్డి. ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రశంశిస్తున్నపేరు. జైలుకు వెళ్లిన అల్లు అర్జున్ కు బెయిల్ తెప్పించిన వ్యక్తి నిరంజన్ రెడ్డి. ఈ న్యాయవాదినికి సినిమా - రాజకీయ నేపథ్యం ఉంది. మెగా ఫ్యామిలీలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్ కేసుల్లో న్యాయవాదిగా పరిచయం ఉన్న నిరంజన్ రెడ్డికి బన్నీ టాస్క్ అప్పగించింది ఎవరు. అసలు నిరంజన్ రెడ్డి ఏం చేసారు.
మెగా ఫ్యామిలీతో
అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే మెగా ఫ్యామిలీకి గుర్తుకు వచ్చిన పేరు నిరంజన్ రెడ్డి. అటు పోలీసులు అరెస్ట్ చేసిన తరువాత నాంపల్లి కోర్టుకు అల్లు అరవింద్ ఒక లీగల్ టీం ను ఏర్పాటు చేసుకున్నారు. ఇదే సమయంలో చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. అటు హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేయాలని ఇటు న్యాయవాదులు సూచించారు. వెంనటే మెగా కాంపౌండ్ నుంచి నిరంజన్ రెడ్డితో నిరంతర సంప్రదింపులు మొదలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగారు. వాదనలకు సిద్దమయ్యారు.

న్యాయవాదిగా
హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటీషన్.. తరువాత బెయిల్ పైన నిరంజన్ రెడ్డి వాదనలను దేశ వ్యాప్తంగా ఆసక్తిగా గమనించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నిరంజన్ రెడ్డిని నిర్మల్ జిల్లా దిలా వర్‌పూర్ మండలం సిర్గాపూర్ గ్రామం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదులు మనోహర్‌రెడ్డి, ప్రతాప్ రెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేశారు. రాజ్యాంగపరమైన అంశాలతో పాటు వేర్వేరు చట్టాలపై నిరంజన్ రెడ్డికి గట్టి పట్టుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల తరఫున పలు కేసుల్లో స్పెషల్ సీనియర్ కౌన్సిల్‌గా పని చేశాడు.
సినీ నిర్మాతగ
వైసీపీ హయాంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా పనిచేశారు. జగన్ కేసులను వాదించారు. సినీ రంగంలోనూ నిరంజన్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దిల్ రాజుకు చెందిన వెంకటేశ్వర క్రియేష న్స్‌కు అనుబంధంగా 2002లో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ 2010లో మరో చరిత్ర, 2011లో గగనం సినిమాలను నిర్మించి ఆ తరువాత, పూర్తిస్థాయి సినీ నిర్మాణ సంస్థగా ఏర్పడి, 2016లో క్షణం, 2017లో ఘాజీ వంటి అవార్డు పొందిన సినిమాలను నిర్మించారు. ఆచార్య సినిమా నిర్మాతగా మెగా ఫ్యామిలీకి సన్నిహితుడయ్యారు.
వాదనల వేళ
ఇప్పుడు అల్లు అర్జున్ కేసులో వాదనల సమయంలో నిరంజన్ రెడ్డి ప్రస్తావించిన అంశాల పైన సహచర న్యాయవాదులు ఆసక్తిగా విన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంలో ఏపీ సిఎం చంద్రబాబు వెళ్తే అక్కడ 30 మందికి పైగా చనిపోయిన విషయాన్ని న్యాయమూర్తి ముందు ప్రస్తావించారు. సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ వెళ్లిన సమయంలో అక్కడ బందోబస్తు.. వచ్చిన జనం గురించి వివరిస్తూనే అల్లు అర్జున్ వస్తున్న సమాచారం ముందుగానే పోలీసుకు ఇచ్చారని వెల్లడించారు. పోలీసులు సైతం అల్లు అర్జున్ ను చూసేందుకు ఆసక్తి చూపించారని చెప్పటంతో కోర్టు హాల్ లో ఒక్క సారిగా నవ్వులు వనిపించాయి. మొత్తంగా అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చేలా చేయటం తో నిరంజన్ రెడ్డి హీరో ఆఫ్ ది డేగా నిలిచారు.












Click it and Unblock the Notifications