చంద్రబాబు దాష్టీకాలు ఆగడం లేదు: లక్ష్మారెడ్డి, సినీ రంగం అభివృద్ధిపై కవిత
మహబూబ్‌నగర్: రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్లు తెలంగాణ వచ్చినా ఏపి సిఎం చంద్రబాబునాయుడు దాష్టీకాలు తప్పడం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. సీడబ్ల్యూసీకి చంద్రబాబు లేఖ రాయడం దురదృష్టకరమని అన్నారు.
పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం కోసం ఏం చేయడానికైనా సిద్ధమని మంత్రి అక్ష్మారెడ్డి ప్రకటించారు. పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకుంటే మరోసారి ఉద్యమం తప్పదని తేల్చి చెప్పారు.

తెలంగాణలో సినీరంగం అభివృద్ధి చెందుతోంది: కవిత
తెలంగాణలో సినిమా రంగం అభివృద్ధి చెందుతోందని టిఆర్ఎస్ ఎంపి కవిత అన్నారు. అందులో తెలంగాణ బిడ్డలకు అపార అవకాశాలు వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్క్ హయత్ హోటల్ జరిగిన ఓ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితోపాటు పాల్గొని మాట్లాడారు. ఉద్యమం సమయంలో పరిశ్రమపై వున్న నమ్మకం వేరు, ప్రస్తుతం వున్న నమ్మకం వేరన్న కవిత, సినీ పరిశ్రమ ఉన్నతికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు.
ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథి రసమయి బాలకిషన్‌తో పాటు పలువురు దర్శకులు, కథానాయికలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువ మీడియా వెబ్‌సైట్ నిర్వహించిన లఘు చిత్రాల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.












Click it and Unblock the Notifications