వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు జవాబేదీ.. గ్లోబరీనా సంస్థకు అర్హత లేకున్నా టెండర్లా : లక్ష్మణ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పులు దొర్లితే ఇంతవరకు ప్రభుత్వం స్పందిచకపోవడం సిగ్గుచేటన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. 26 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. కనీస అర్హత లేని గ్లోబరీనా సంస్థకు ఇంటర్ ఫలితాల నమోదు ప్రక్రియ కాంట్రాక్ట్ ఇచ్చి విద్యార్థులను బలిపశువులుగా చేశారని ధ్వజమెత్తారు.

గ్లోబరీనా సంస్థ కారణంగా తప్పులు దొర్లాయని రుజువైనప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన లక్ష్మణ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో దొర్లిన తప్పులకు సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు. త్రిసభ్య కమిటీ నివేదిక ప్రకారం యాక్షన్ తీసుకుంటామన్న ప్రభుత్వం.. రిపోర్ట్ వచ్చాక ఆ సంస్థపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు సంశయిస్తోందని ప్రశ్నించారు.

laxman telangana bjp president fires on cm kcr

ఓయూ క్యాంపస్‌లో విద్యార్థినుల ఆందోళన.. ఆగంతకుడు చొరబడ్డ ఘటనపై సీరియస్..!

టీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలను తొక్కిపెడుతూ అవాస్తవాలను చిత్రీకరిస్తూ ఎన్నాళ్లు పాలన సాగిస్తుందని ప్రశ్నించారు. ఇంటర్మీడియట్ ఫలితాల తప్పిదాలపై బీజేపీ పోరాటం చేసిందని.. తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విన్నపాలు చేసిందని.. అయినా కూడా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు.

ఇంటర్మీడియట్ ఫలితాల తప్పిదాలతో 26 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారని.. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ అంతా ఈజీగా విడిచిపెట్టదని హెచ్చరించారు. న్యాయం జరిగేంత వరకు ఎంతవరకైనా వెళతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించలేదని.. అందుకే కేంద్ర హోంశాఖ, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరారు.

English summary
Telangana bjp president laxman fires on cm kcr in the issue of intermediate results. He demands for take action on globarena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X